పాన్ ఇండియా ట్రిక్ తెలిసింది టాలీవుడ్ కేనా!
అటుపై అదే ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన కాంతార మరింత బూస్టింగ్ ఇచ్చింది.
పాన్ ఇండియాలో సినిమాలు చేసి సంచలనాలు నమోదు చేయడం అన్నది కేవలం టాలీవుడ్ కే చెల్లిందా? ఆ ట్రిక్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకే తెలుసా? అంటే అవుననే అనాలి. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం టాలీవుడ్ పాన్ ఇండియా ట్రెండ్ కి బీజం వేసింది. అదే ` బాహుబలి ది బిగినింగ్`...ఆ తర్వాత టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన `బాహుబలి ది కన్ క్లూజన్`, `కార్తికేయ-2`, `ఆర్ ఆర్ ఆర్`, `దేవర` చిత్రాలతో ఆ వేవ్ కొనసాగుతుంది. మధ్యలో కన్నడ పరిశ్రమ `కేజీఎఫ్` ప్రాంచైజీతో ఈరేసులో నిలిచింది.
అటుపై అదే ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన కాంతార మరింత బూస్టింగ్ ఇచ్చింది. అలా పాన్ ఇండియా రేసులో శాండిల్ వుడ్ రెండవ స్థానంలో ఉంది. కోలీవుడ్ పాన్ ఇండియా కోసం ట్రై చేస్తున్నా అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వడం లేదు. `పొన్నియన్ సెల్వన్` ప్రాంచైజీ, `తంగలాన్`, `కంగువా` లాంటి చిత్రాలతో పాన్ ఇండియా అటెంప్ట్ చేసినా పనవ్వలేదు. ఇటీవల టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన `పుష్ప-2` తో బాలీవుడ్డే బ్లాస్ట్ అయింది.
అక్కడ ఖాన్ లు..కపూర్ ల ఫస్ట్ డే రికార్డులు సైతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రేక్ చేసి హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇదే స్థాయిలో వెలిగిపోవాలని హిందీ పరిశ్రమ నుంచి కొన్ని పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ అవి సౌత్ కి అంతగా కనెక్ట్ అవ్వలేదు. చివరికి తెలుగు హీరోల్ని తీసుకుని తమ చిత్రాల్లో పెట్టు కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.
మొత్తంగా వెరసి చూస్తే పాన్ ఇండియా ట్రిక్ తెలిసింది కేవలం టాలీవుడ్ కి మాత్రమేనని యావత్ అన్ని పరిశ్రమలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ నే మార్కెట్ టార్గెట్ చేసి ముందుకెళ్తున్నాడు. ఇది గనుక సక్సెస్ అయితే తెలుగు సినిమా రేంజ్ ప్రపంచ స్థాయిలో మరోసారి వెలిగిపోతుంది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రానికి ఆస్కార్ రావడంతోనే టాలీవుడ్ సత్తా ప్రపంచానికి పరిచయం అయిందనుకోండి.