సలార్ రాకుంటే.. కాచుకొని ఉన్నారు
ఇండస్ట్రీలో ఓ బడా సినిమా అయినా విడుదల అవుతుందంటే.. ఆ సమయంలో ఇతర చిత్రాలేవి రిలీజ్ కు ధైర్యం చెయ్యవు
ఇండస్ట్రీలో ఓ బడా సినిమా అయినా విడుదల అవుతుందంటే.. ఆ సమయంలో ఇతర చిత్రాలేవి రిలీజ్ కు ధైర్యం చెయ్యవు. వెనక్కి తగ్గుతాయి. అయితే అదే బడా సినిమా రిలీజ్ కు వాయిదా పడే అవకాశముందంటే తెలిస్తే.. అదే సమయంలో ఇతర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కాచుకుని కూర్చొని ఉంటాయి.
ఇప్పుడు టాలీవుడ్ సెప్టెంబర్ లో ఇదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. ఈ నెల చివర్లో 28వ తేదీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ లో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.
అయితే ఈ చిత్రం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా, ప్రమోషన్స్ ను మొదలు పెట్టకుండా ఫ్యాన్స్ ను నిరాశపరుస్తోంది. ఇక ఇదే సమయంలో ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడే అవకాశముందని తెలిసింది. మేకర్స్ ఈ చిత్రాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
ఇక అదే సమయంలో అక్టోబర్ 20న రావాల్సిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా.. సలార్ రిలీజ్ డేట్ కు వచ్చేందుకు ప్రయత్నిస్తుందట. ప్రచారం లో ఉన్నట్టుగానే సలార్ వాయిదా పడితే మాత్రం ఆ బెర్త్ ను ఖరాలు చేసుకోవాలని ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 20న ఒకరోజు అటు ఇటుగా భారీ చిత్రాలు బాలయ్య భగవంత్ కేసరి, దళపతి విజయ్ లియో కూడా రానున్నాయి. అందుకే అభిషేక్ అగర్వాల్.. గట్టి పోటీ ఉన్నందున ఈ రేసు నుంచి తప్పుకుని సలార్ టైమ్ కు రావాలని ట్రై చేస్తున్నారట.
మరోవైపు సెప్టెంబర్ 15న రామ్ పోతినేని-బోయపాటి శ్రీను స్కంద విడుదలకు రెడీ అయింది. అయితే ఇప్పుడీ చిత్రం కూడా సలార్ రిలీజ్ డేట్ పై కన్నేసిందట. సలార్ రాకపోతే 15 నుంచి 28కు వెళ్లాలని ఆలోచిస్తుందట. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కూడా కాస్త నెగటివిటీని తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మూవీటీమ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది.
అలా స్కంద, టైగర్ నాగేశ్వరరావు సలార్ డేట్ కోసం కాచుకొని ఉన్నాయి. ఒకవేళ స్కందకు 28న బెర్త్ దొరకకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ముందుగా అనుకున్న తేదీ ప్రకారం 15న ఏ సినిమాలు పోటీకి లేవు. కానీ టైగర్ నాగేశ్వరరావుకు అలా కాదు. అక్టోబర్ 20 భగవంత్ కేసరి, లియో పోటీకి ఉండగా.. సెప్టెంబర్ 28కి వస్తే స్కంద ఉండే అవకాశం ఉంటుంది. అంటే టైగర్ వేటాడడానికి టైమ్ కాస్త టైట్ గానే ఉందని అర్థమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..