ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గింది.. ఈ ట్రెండ్ ఆపేస్తే బెటరేమో..!

పెరిగిన టికెట్ రేట్లు థియేటర్ లో తినుబండారాల ఖర్చు వీటన్నిటికీ భయపడి థియేటర్ కి వెళ్తే జేబుకి చిల్లే అని ఫిక్స్ అయ్యాడు

Update: 2023-11-04 04:21 GMT

ఈమధ్య కాలంలో స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది అన్నది పక్కన పెడితే రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. స్టార్ హీరో ఒకప్పటి కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అనగానే అభిమానుల్లో సినీ ప్రేక్షకుల్లో ఒక నూతన ఉత్సాహం ఉండేది. కానీ రీ రిలీజ్ అంటూ రెండు దశాబ్దాల క్రితం వచ్చిన అన్ని సినిమాలు రిలీజ్ చేస్తుంటే ఫ్యాన్స్ కి విసుగెత్తేసింది. ఈమధ్య కాలంలో థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం అనేది చాలా పెద్ద ఖర్చుతో కూడిన పనిగా మారింది.

పెరిగిన టికెట్ రేట్లు థియేటర్ లో తినుబండారాల ఖర్చు వీటన్నిటికీ భయపడి థియేటర్ కి వెళ్తే జేబుకి చిల్లే అని ఫిక్స్ అయ్యాడు. కొత్త సినిమాలకే ఈ ఇబ్బంది ఉంటే రీ రిలీజ్ సినిమాలకు ఇది మరింత కనబడుతుంది. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమా రీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ లో కూడా అంత ఉత్సాహం లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మొదటి రెండు షోలు తప్ప మిగతా షోల టికెట్స్ బుకింగ్ లో దూకుడు కనిపించడం లేదు. మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంతా ఆసక్తి కనబరచడం లేదు.

ఆల్రెడీ చాలా సార్లు చూసిన సినిమాలు ఇంటర్నెట్ లో ఫ్రీ గా దొరికే సినిమాలు రీ రిలీజ్ అంటూ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ కొన్ని సినిమాలకే ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుంది. చిరంజీవి శంకర్ దాదా మాత్రమే కాదు ఎన్.టి.ఆర్ అదుర్స్ కూడా 17న రీ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ సింహాద్రి, బాద్షా ఆంధ్రావాలా సినిమాలు రీ రిలీజ్ లు జరిగాయి. ఇప్పుడు అదుర్స్ సినిమా వస్తుంది.

రీ రిలీజ్ సినిమాల వల్ల కొన్ని చోట్ల బిజినెస్ బాగానే జరుగుతున్నా కొన్ని చోట్ల అంతకంత నష్టం జరుగుతుంది. ఫ్యాన్స్ హంగామాలో పూనకాలు వచ్చినట్టు చేసి థియేటర్ ప్రాపర్టీని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇది కూడా హెడేక్ గా మారింది. 7/G బృందావన కాలనీ సినిమా ఎన్నో అంచనాలతో రీ రిలీజ్ అవగా ఆ సినిమాకు కూడా పూర్ రెస్పాన్స్ వచ్చింది. కొత్త కంటెంట్ తో సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తున్న సినిమాలు వస్తున్న ఈ టైంలో ఆల్రెడీ చూసిన సినిమాల మీద ఆసక్తి చూపించట్లేదు. మరి ఇప్పటికైనా ఈ రీ రిలీజ్ విషయంలో ఆలోచించి ట్రెండ్ కి బ్రేక్ ఇస్తే బెటర్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News