4వ రోజు హైయెస్ట్ షేర్స్ సాధించిన తెలుగు సినిమాలివే
టాలీవుడ్ సినిమాలు ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే
టాలీవుడ్ సినిమాలు ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగు కమర్షియల్ మూవీస్ కి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. వారం పది రోజుల పాటు కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతున్నాయి. నిర్మాతలకి కావాల్సింది కూడా ఇదే. అందుకే ఎక్కువ థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేస్తూ, వీలైనంత వేగంగా పెట్టుబడి మొత్తం రికవరీ చేసుకునే పనిలో ఉన్నారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీలో నాలుగో రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో డార్లింగ్ ప్రభాస్ సలార్ ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి అద్భుతమైన ఆదరణ లభించింది. దీంతో వీకెండ్ తర్వాత కూడా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రెండో స్థానంలో జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచింది. మూడో స్థానంలో కూడా రాజమౌళి బాహుబలి 2 ఉండటం విశేషం.
నాలుగో స్థానంకి వచ్చేసరికి ఒక్క తెలుగులోనే రిలీజ్ అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారిపాట మూవీ నిలబడటం గమనార్హం. తరువాత అల్లు అర్జున్ ఆల వైకుంఠపురంలో, నెక్స్ట్ వాల్తేర్ వీరయ్య సినిమాలు ఉన్నాయి. దీని తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ఏడో స్థానంలో ఉంది. ఇక తాజాగా సంక్రాతి బరిలో రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ గుంటూరు కారం నాలుగో రోజు సాలిడ్ షేర్ సొంతం చేసుకుంది.
దీంతో ఎనిమిదో స్థానంలోకి వచ్చింది. ఈ చిత్రం తర్వాత సాహో, సరిలేరు నీకెవ్వరూ, మహర్షి, అఖండ సినిమాలు నిలిచాయి. గుంటూరు కారం సినిమాకి బెన్ ఫిట్ షో నుంచి మిక్సడ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఇప్పటికే గ్రాస్ పరంగా 200 కోట్ల మార్క్ కి రీచ్ అయిపొయింది. నాలుగో రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు, వాటి కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
సలార్ – 18.05Cr
ఆర్ఆర్ఆర్ మూవీ – 17.73Cr
బాహుబలి 2 – 14.65Cr
సర్కారువారిపాట మూవీ- 12.06Cr
అల వైకుంఠపురంలో – 11.56Cr
వాల్తేర్ వీరయ్య – 11.42Cr
కేజీఎఫ్ చాప్టర్ 2 – 10.81Cr
గుంటూరు కారం – 9.67Cr*******
సాహో – 9.60Cr
సరిలేరు నీకెవ్వరూ– 8.67Cr
మహర్షి – 8.44Cr
అఖండ- 8.31Cr
దువ్వాడ జగన్నాథమ్- 7.67Cr