సంక్రాంతి పోటీ.. మొదట్లో ఎవరు? చివరలో ఎవరు?

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి

Update: 2024-01-14 18:47 GMT

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో మహేష్ బాబు 'గుంటూరు కారం', తేజ సజ్జ 'హనుమాన్' జనవరి 12న రిలీజ్ అవ్వగా మరునాడు అంటే జనవరి 13న వెంకటేష్ 'సైంధవ్' 14న నాగార్జున 'నా సామిరంగ' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ నాలుగు సినిమాలు రిలీజ్ అయిన నేపథ్యంలో వీటిలో ఏ సినిమాకి ఆడియన్స్ ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారని అంశం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది.

ఆడియన్స్ రెస్పాన్స్ ని బట్టి 'హనుమాన్' మూవీ టాప్ ప్లేస్ లో ఉంది. రిలీజ్ కి ముందే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో భారీ హై క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత కూడా అంతకు మించి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, నార్త్ లోనూ భారీ కలెక్షన్స్ అందుకుంటూ బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతోంది. ప్రశాంత్ వర్మ టేకింగ్, తేజ సజ్జ యాక్టింగ్ తో పాటూ విజువల్స్, వీఎఫెక్స్, గ్రాఫిక్స్ ఇలా టెక్నికల్ గాను బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడంతో 'హనుమాన్' కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇక హనుమాన్ తర్వాత ఈరోజు రిలీజ్ అయిన నాగార్జున 'నా సామిరంగ' మూవీ యావరేజ్ టాక్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. నాగార్జున ప్రతి సంక్రాంతికి ఓ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు అందిస్తూ వస్తున్నాడు. అలా ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు వంటి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈసారి 'నా సామిరంగ' తో కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. నాగార్జున ఈ సినిమాలో విలేజ్ కల్చర్ ని చాలా బాగా చూపించారు.

దాంతో సరిగ్గా పండగ సీజన్ అయిన సంక్రాంతికి రిలీజ్ చేయగా సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదనే టాక్ వచ్చింది. ఇక రిలీజ్ కి ముందే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన మహేష్ బాబు 'గుంటూరు కారం' ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ రాబట్టింది. సినిమా మహేష్ ఫ్యాన్స్ కి తప్పితే సాధారణ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు అనే విధంగా సోషల్ మీడియాలో వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే సినిమాలో మహేష్ క్యారెక్టర్ ని త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేశాడు. దాన్ని 100% స్క్రీన్ పై చూపించాడు.

కానీ త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో మిస్సైంది. దాంతో సినిమాకి బిలో యావరేజ్ టాక్ వచ్చింది. స్టార్ హీరో కాబట్టి కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కానీ సినిమా మాత్రం ఆడియన్స్ ని అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అటు విక్టరీ వెంకటేష్ నటించిన 'సైంధవ్' ది కూడా ఇదే పరిస్థితి. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను సినిమాలో వెంకటేష్ ని యాక్షన్ అవతార్ లో చాలా బాగా తీర్చిదిద్దారు. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో వెంకీ అదరగొట్టేసారు.

దర్శకుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక కొత్త తరహా ప్రయోగం చూపించాడు. కానీ కథనంలో తేడా కొట్టడంతో 'సైంధవ్' పూర్తి స్థాయిలో జనాలను ఆకట్టుకోలేకపోయాడు. దానికి తోడు హనుమాన్ హైప్ ఎక్కువవ్వడం వలన కూడా ఈ సినిమా వైపు జనాల ఫోకస్ ఎక్కువగా పడలేదు. మొత్తానికి 2024 సంక్రాంతి లో బడా సినిమా సీనియర్ హీరోల కంటే ఎక్కువ స్థాయిలో తేజ సజ్జా హనుమాన్ మొదటి స్థానంలో నిలిచింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు లాభాలు అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News