స్టార్ హీరోకి 'నేవీ' అత్యున్నత గౌరవం
మూడు సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోవడం ద్వారా ప్రపంచ ప్రసిద్ది గాంచిన నటుల్లో ఒకరిగా టామ్ క్రూజ్ నిలిచారు.
హాలీవుడ్ ఐకాన్ స్టార్‌గా పేరున్న థామస్ క్రూజ్ మాపోథర్ అలియాస్ టామ్ క్రూజ్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన గొప్ప నటుడిగా టామ్ క్రూజ్‌కి రికార్డ్ దక్కింది. మూడు సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోవడం ద్వారా ప్రపంచ ప్రసిద్ది గాంచిన నటుల్లో ఒకరిగా టామ్ క్రూజ్ నిలిచారు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలు అన్నీ కలిపి ప్రపంచ వ్యాప్తంగా 12 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించాయి అని వరల్డ్ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
1980లో టామ్ క్రూజ్ తన నటన జీవితంను ప్రారంభించారు. ఈ 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, రికార్డ్‌లు సొంతం చేసుకున్న ఈయన ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కలిగి ఉన్నాడు. వరల్డ్ సినీ చరిత్రలో అత్యధికంగా 100 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన హీరోగా ప్రపంచ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆయనకు యూఎస్ నేవీ యొక్క అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. నేవీ గొప్పతనం, నేవీలో పని చేసే వారి త్యాగాలను సినిమాల్లో అద్భుతంగా చూపించి యూఎస్ నేవీ యొక్క గౌరవాన్ని పెంచినందుకు గాను ఈ అరుదైన పురస్కారంను టామ్ క్రూజ్ సొంతం చేసుకున్నారు.
టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్, బార్న్ ఆన్ ది ఫోర్త్ ఆఫ్ జులై, మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాల్లో నేవీని గొప్పగా చూపించారు. ఆ సినిమాల్లో నేవీ అధికారులను హీరోలుగా చూపించడంతో పాటు సామాన్య ప్రేక్షకులకు నేవీ గురించి ఒక అవగాణ కలగడంతో పాటు, ఎక్కువ శాతం మందికి నేవీ పై గౌరవం పెరగడంలో దోహదం చేశాయి. అందుకే ఆ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినందుకు గాను టామ్ క్రూజ్‌కి ఈ గౌరవం దక్కినట్లుగా హాలీవుడ్‌కి చెందిన మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి.
1986లో ది కలర్ ఆఫ్ మనీ, 1988లో రెయిన్ మ్యాన్ పాత్రలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. 1990లో పీపుల్స్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా నిలిచారు. 1997లో అత్యంత అందమైన వ్యక్తి గా వరల్డ్‌లో నెం.1 స్థానంను సొంతం చేసుకున్నాడు. ఇలా ఎన్నో గుర్తింపులు, గౌరవాలను సొంతం చేసుకోవడం ద్వారా టామ్ క్రూజ్ ప్రపంచ ప్రసిద్దిగాంచిన విషయం తెల్సిందే. ఇప్పుడు టామ్ క్రూజ్‌కి ఏకంగా యూఎస్ నేవీ అరుదైన గౌరవం దక్కడంతో ఆయన జీవితంలో అత్యున్నత పురస్కారంగా చెప్పుకోవచ్చు.