భారీ బడ్జెట్‌తో వచ్చిన సాంగ్స్.. టాప్-5 ఇవే!
అయితే టాలీవుడ్ సినిమాల్లో పాటలను చిత్రీకరించడం కోసం ఏకంగా కొన్ని కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారట. ఆ జాబితాలో ఉన్న టాప్-5 పాటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మేకర్స్ కొన్నిసార్లు తమ సినిమాల్లోని పాటలను షూట్ చేయడం కోసం వేరే దేశాలు లేదా ఇతర ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. మరికొన్ని సార్లు భారీ సెట్లు వేసి అందులోనే చిత్రీకరిస్తుంటారు. అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు కూడా చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు అందమైన ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి షూట్ చేస్తుంటారు. అయితే టాలీవుడ్ సినిమాల్లో పాటలను చిత్రీకరించడం కోసం ఏకంగా కొన్ని కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారట. ఆ జాబితాలో ఉన్న టాప్-5 పాటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాలోని రాములో రాముల పాటకు మేకర్స్ ఏకంగా రూ.1.2 కోట్లు ఖర్చు చేశారట. ఈ పాటను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేశారు. చాలా నెలలపాటు ఈ పాట ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. అనేక శుభకార్యాలు, కాలేజీ ఫంక్షన్లలో డ్యాన్స్ వేయాలంటే ఈ పాట ఉండాల్సిందే.
బన్నీ నటించిన మరో చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలోని ఇరగ ఇరగ సాంగ్ షూట్ చేయడానికి మేకర్స్ రూ.1.5 కోట్ల ఖర్చు చేశారట.విశాల్, శేఖర్ కాంబో ఈ పాటకు బాణీలు అందించింది. రాహుల్ సిప్లిగంజ్ మాస్ వాయిస్‌తో ఈ పాటకు ప్రాణం పోశారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన సూపర్ హిట్ మూవీ రంగస్థలంలోని రంగమ్మ మంగమ్మ అప్పట్లో దుమ్ముదులిపేసింది. ఆ పాటను చిత్రీకరించడానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఈ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. సమంత తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేసింది.
మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలోని వచ్చాడయ్యో స్వామీ పాటకు ఏకంగా రూ.2.5 కోట్లు ఖర్చు చేశారట. ఈ పాటలోని బ్యాక్ గ్రౌండ్స్ సెట్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారట. వందల మంది డ్యాన్సర్ల మధ్య మహేశ్ పంచెకట్టులో సింపుల్ స్టెప్స్‌తో అదరగొట్టేశారు. ఈ పాటను కూడా దేవిశ్రీనే కంపోజ్ చేశారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన వాటిలో టాప్ వన్‌లో ఉంది బాహుబలి సినిమాలోని సాహోరే బాహుబలి సాంగ్. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాట కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేశారట. వందలాది మంది డాన్సర్లతో ఈ పాటను భారీగా చిత్రీకరించారు. మరోవైపు, రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్‌ఛేంజర్ మూవీలోని జరగండి సాంగ్‌కు ఏకంగా రూ.15 కోట్ల ఖర్చు చేసినట్లు సమాచారం