యానిమల్ ట్రోలింగ్ పై నటి స్పందన..!

యానిమల్ రిలీజ్ టైం లో తృప్తి పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అంతేకాదు సినిమాలో ఆమె సీన్స్ పై కొందరు విపరీతమైన ట్రోల్స్ కూడా చేశారు. వీటిపై లేటెస్ట్ గా స్పందించింది త్రిప్తి.

Update: 2024-03-01 17:30 GMT

సందీప్ వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీస్ ఒక వర్గం ఆడియన్స్ దాన్ని చీదరించుకున్నా సరే సందీప్ వంగ ఏ మోటోతో అయితే సినిమా తీశాడో ఆ టార్గెట్ రీచ్ అయ్యింది. డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 900 కోట్ల పైన కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. యానిమల్ సినిమా గురించి ఎక్కడ వినిపించినా సరే అందులో త్రిప్తి డిమ్రి పేరు వినిపిస్తుంది.

సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినా దాని ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంది. యానిమల్ రిలీజ్ టైం లో తృప్తి పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అంతేకాదు సినిమాలో ఆమె సీన్స్ పై కొందరు విపరీతమైన ట్రోల్స్ కూడా చేశారు. వీటిపై లేటెస్ట్ గా స్పందించింది త్రిప్తి.

డైరెక్టర్ సందీప్ వంగ కథ చెప్పినప్పుడే తన పాత్ర చాలా చిన్నదే కానీ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. అయితే తను చేసే పాత్ర గురించి ప్రేక్షకులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే సరిపోదు మన నిర్ణయాలు మార్చుకుంటే మనం చేయాలనుకున్నది ఎప్పటికీ చేయలేం. అందుకే యానిమల్ లో ఆ పాత్రని ఓకే చేశా. ఎప్పుడు కూడా సౌకర్యవంతమైన పాత్రలే చేయాలని తాను అనుకోననని అన్నారు త్రిప్తి.

యానిమల్ లో తాను నటించిన శృంగార సన్నివేశాలు చూసి తన పేరెంట్స్ షాక్ అయ్యారు. సినిమాకు ఆ సీన్ ఎంత ముఖ్యమో వాళ్లకు చెప్పాను. అయితే తన తొలి సినిమా రిలీజ్ తర్వాత తన ఫాదర్ తానొక నటినని అందరితో గర్వంగా చెప్పాలనుకున్నారు. అయితే ఆ టైంలో తనకు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ యానిమల్ తర్వాత అందరు తనని గుర్తుపడుతున్నారని చెప్పుకొచ్చింది త్రిప్తి డిమ్రి.

యానిమల్ హిట్ తో అమ్మడు బాలీవుడ్ లో ఫేవరెట్ గా మారింది. ప్రస్తుతం అక్కడ మేరే మెహబూబ్ మేరే సనం తో పాటుగా విక్కి విద్యా కా వో వాలా వీడియో లో నటిస్తుంది. సౌత్ నుంచి కూడా త్రిప్తికి అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాలో త్రిప్తి ని తీసుకున్నారని తెలుస్తుండగా.. రవితేజ అనీల్ రావిపుడి కాంబో సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

Tags:    

Similar News