హీరోయిన్ కి రెండు గంటలు గ్యాప్ ఇవ్వని డైరెక్టర్!
అయితే 'లియో' విషయంలో త్రిషకి మాత్రం దర్శకుడు లోకేష్ కగనరాజ్ గ్యాప్ ఇవ్వకుండా నేరేషన్ ఇచ్చిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా స్టార్ కాంబినేషన్స్ లో దర్శకులు కేవలం హీరోలకు మాత్రమే పూర్తి స్థాయిలో స్టోరీ నేరేషన్ ఇస్తారు. సినిమాకి హీరో పిల్లర్ కాబట్టి దర్శకుడు హీరో ఇమేజ్ ని కూడా ఆధారం చేసుకుంటాడు కాబట్టి! అక్కడ నేరేషన్ తప్పదు. ఇక హీరోయిన్లకు అయితే కేవలం తమ పాత్ర వరకే నేరేషన్ ఇస్తారు. స్టోరీ మొత్తం నేరేడ్ చేయడం అన్నది పెద్దగా జరగదు. ఎంత స్టార్ హీరోయిన్ అయినా పాత్రవరకూ చూసుకుం టుంది తప్ప! మొత్తం స్టోరి వినే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.
అయితే 'లియో' విషయంలో త్రిషకి మాత్రం దర్శకుడు లోకేష్ కగనరాజ్ గ్యాప్ ఇవ్వకుండా నేరేషన్ ఇచ్చిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'లియో' లో విజయ్ కి జోడీగా త్రిష నటించిన సంగతి తెలిసిందే. ఇందులో త్రిష పాత్రకి ప్రాధన్యత ఉంటుంది. నటనకు ఆస్కారం ఉన్న రోల్ ఇది. దీంతో ఈ సినిమా లో తన పాత్రతో పాటు...స్టోరీ మొత్తం నేరేషన్ ఇచ్చాడుట. దాదాపు రెండు గంటలపాటు సినిమా ఆఫీస్ లో ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా కథ చెప్పాడుట.
ఇంతవరకూ ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఏ దర్శకుడితోనూ చేయలేదని త్రిష తెలిపింది.' ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేసాను. కానీ రెండు గంటలు ఏ సినిమా కథ వినలేదు. లియో కోసం అంత సమయం కేటా యించాల్సి వచ్చిందని...లోకోష్ తో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపింది. ఫాంటసీ ..ఫిక్షన్ ..మాస్ ఇలా అన్ని అంశాలు కలిపి తీయడం గొప్ప విషయం అని ప్రశంసించింది.
'లియో' కంటే ముందు అమ్మడు 'పొన్నియన్ సెల్వన్' సినిమా చేసింది. ఇందులో త్రిష రోల్ కూడా ఎంతో కీలకమైంది. ఆసినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించారు. అంతకు ముందు అదే దర్శకుడితో త్రిష 'యువ' లాంటి సినిమా చేసింది. మణిరత్నం కూడా హీరోయిన్లకు స్టోరీలు చెప్పరు. కేవలం ఆయన బ్రాండ్ కోసం వినకుండానే సినిమాలు చేస్తారు. కానీ పొన్నియన్ సెల్వన్ కథ మాత్రం త్రిష విన్న తర్వాత ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.