గురూజీ ముందు గొప్ప అవ‌కాశం మ‌రేం చేస్తాడో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియా వైడ్ ఓ సంచ‌ల‌న స్టార్. బాలీవుడ్ లో ఖాన్ లు..క‌పూర్ ల రికార్డులు సైతం తిర‌గ‌రాసిన హీరో.

Update: 2024-12-09 01:00 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియా వైడ్ ఓ సంచ‌ల‌న స్టార్. బాలీవుడ్ లో ఖాన్ లు..క‌పూర్ ల రికార్డులు సైతం తిర‌గ‌రాసిన హీరో. `పుష్ప‌-2` వ‌సూళ్ల దెబ్బ‌కి అక్క‌డ హీరోల‌కు మెంట‌లెక్కిపోతుంది. లాంగ్ ర‌న్ లో ఇంకెన్ని సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తాడో తెలియ‌దు. 2000 కోట్లు వ‌సూళ్లు సాధించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఆ ర‌క‌మైన అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇక ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ చేసే ఏ సినిమా అయినా ఇండియా వైడ్ ఓ సంచ‌ల‌న‌మే.

అత‌డి తో ప‌నిచేసే ఏ ద‌ర్శ‌కుడైనా ల‌క్కీ అనే చెప్పాలి. ఇప్పుడా లిస్ట్ లో ముందు లో ఉన్న‌ది గురూజీ త్రివిక్ర‌మ్ అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం `పుష్ప‌-2` స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న బ‌న్నీ త‌దుప‌రి చిత్రం గూరూజీతోనే ఉంది. అయితే గురూజీ పాన్ ఇండియాలో దుమారం అవ్వ‌డానిక ఇదొక గొప్ప అవ‌కాశం. ఇంత వ‌ర‌కూ త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా సినిమా తీయ‌లేదు. రీజ‌న‌ల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే క‌థ‌లు రాసుకుని సినిమాలు చేసారు.

కానీ ఇప్పుడు బ‌న్నీతో పాన్ ఇండియా సినిమా ముందుంది. బ‌న్నీ క్రేజ్ తో త్రివిక్ర‌మ్ పాన్ ఇండియాకి వెళ్ల‌డం చాలా ఈజీ. ఈ విష‌యంలో ఏ ద‌ర్శ‌కుడికి రాని అవ‌కాశం త్రివిక్రమ్ కి వ‌చ్చింద‌న్న‌ది వాస్త‌వం. `దేవ‌ర‌`తో కొర‌టాల శివ పాన్ ఇండియాకి ప‌రిచ‌యం అయ్యారు. కానీ `దేవ‌ర` సౌండింగ్ నార్త్ లో అంత‌గా లేదు. `ఆర్ ఆర్ ఆర్` తో హిందీ బెల్డ్ లో ఎన్టీఆర్ కి గుర్తింపు ఉన్న‌ప్ప‌టికీ అది కొరటాల‌కు పెద్ద‌గా క‌లిసి రాలేదు.

కానీ బ‌న్నీ ఇమేజ్ మాత్రం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. స‌రైక క‌థ రాసుకుంటే గురూజీ పాన్ ఇండియాని షేక్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడే. మ‌రి బ‌న్నీ కోసం త్రివిక్ర‌మ్ ఎలాంటి క‌థ సిద్దం చేస్తున్నాడు? అన్న‌ది తెలియాలి. ఇంత వ‌ర‌కూ ఇది పాన్ ఇండియా సినిమానా? రిజ‌న‌ల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారా? అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌లేదు.

Tags:    

Similar News