త్రివిక్రమ్ బ్లండర్ ను బయటపెట్టిన డైరెక్టర్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

Update: 2024-02-10 09:18 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్- మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది.

కానీ థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత గుంటూరు కారం మూవీకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్, మహేష్ ఫ్యాన్స్ ను తప్పితే నార్మల్ ఆడియన్స్ ను అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, డాన్స్.. అన్ని ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.

అయితే ఈ సినిమాపై ఇటీవలే సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోల ఇమేజ్‌ ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే దెబ్బ అయిపోతామని అన్నారు. "త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గట్లుగా మూవీ చేయాలని కిందా మీదా పడ్డారు. అందువల్లే గుంటూరు కారం రిజల్ట్ అలా వచ్చింది. అదే హీరో ఇమేజ్‌ ను పక్కన పెట్టి.. కథపై దృష్టి పెట్టుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉంటుంది. కథను నమ్ముకుని సినిమా చేస్తే ఎప్పుడు పరాజయం అనేది ఉండదు" అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

"నేను కథను నమ్ముకున్నప్పుడు ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. హీరోల ఇమేజ్‌ కు తగ్గట్లుగా మూవీ చేయాలనుకున్నప్పుడు మాత్రం దెబ్బైపోయాను. బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమా చేయాలని ప్రయత్నించడంతో ఆ కథ పక్కకు పోయింది. అందువల్లే టాప్ హీరో సినిమా ఫ్లాప్ అయింది. హీరోకు తగ్గట్లుగా ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథని కథలాగే తీయాలి. యమలీల చిత్రంలో నేను కథ గురించే ఆలోచించాను. ఇంకేమి పట్టించుకోలేదు" అని చెప్పారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో 90వ దశకంలో వరుస హిట్లు అందుకున్న దర్శకుడు ఎస్వీ కృష్టారెడ్డి. ఆయన సినిమా అంటేనే హిట్ అనే స్థాయిలో అభిమానుల్లో అంచనాలు ఉండేవి. నాటి సినిమాలు ఇప్పటి వాళ్లకు కూడా పరిచయమే. ఫ్యామిలీ కథలను ఎస్వీ కృష్ణా రెడ్డి తీయడం, దానికి రికార్డులు బద్దలవ్వడం కామన్‌ గా తెలుగు ఇండస్ట్రీలో జరుగుతుండేది. ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ టేకింగ్ ను కృష్ణారెడ్డి తప్పుపట్టడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News