గురూజీ ప్లానింగ్ లో వాళ్లు లేరా..?

అయితే త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా టైర్ 2 హీరోలతో చేస్తాడంటూ ఒక టాక్ నడుస్తుంది.

Update: 2024-03-23 16:30 GMT

గుంటూరు కారం సినిమాతో మరో సక్సెస్ అందుకున్న త్రివిక్రం సినిమా లో తన మార్క్ మిస్ అయ్యిందన్న టాక్ వచ్చినా సినిమా హిట్ అందుకున్నందుకు హ్యాపీగానే ఉన్నాడు. మహేష్ తో అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలం తర్వాత చేసిన సినిమా గుంటూరు కారం. మహేష్ వన్ మ్యాన్ షో నచ్చి ఫెస్టివల్ సీజన్ వల్ల సినిమా లాక్కొచ్చేసింది కానీ గురూజీ మాత్రం ఈ సినిమాలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళి సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలైంది.

ఇక త్రివిక్రం ఏం చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అసలైతే అల్లు అర్జున్ తో గురూజీ సినిమా చేయాల్సి ఉన్నా అది హోల్డ్ లో పడినట్టే అని చెప్పుకుంటున్నారు. త్రివిక్రం తో సినిమా కన్నా తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ సినిమా ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ టైం లో త్రివిక్రం మరో స్టార్ హీరోని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా టైర్ 2 హీరోలతో చేస్తాడంటూ ఒక టాక్ నడుస్తుంది. కానీ అది జరిగే పరిస్థితి లేదని అర్థమవుతుంది. త్రివిక్రం కథలకు స్టార్స్ మాత్రమే సెట్ అవుతారు. అప్పట్లో నితిన్ తో అ ఆ అని ఓ ప్రయత్నం చేసినా ఆ తర్వాత మళ్లీ త్రివిక్రం వరుస సినిమాలు స్టార్స్ తో చేస్తూ వచ్చాడు. టైర్ 2 హీరోలతో సినిమా చేసే ఛాన్స్ ఉన్నా కూడా గురూజీ ఆ ప్రయత్నాలు చేయట్లేదు. అదీగాక ఇప్పుడు యువ హీరోలతో పాటు స్టార్ హీరోలంతా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బన్నీ సినిమా లేకపోతే వెంటనే పవన్ తో త్రివిక్రం ఏదైనా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

పవన్ ప్రస్తుతం OG, హరి హర వీరమల్లు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నెక్స్ట్ ఇయర్ పూర్తి చేస్తాడని టాక్. సో ఈ గ్యాప్ లో త్రివిక్రం కథ రెడీ చేస్తే పవన్ ఓకే అనేస్తాడు. అల్లు అర్జున్ అట్లీ సినిమా పూర్తయ్యేలోగా త్రివిక్రం మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. మరి అది పవన్ తో అవుతుందా లేదా మరో హీరో తో కుదురుతుందా అన్నది చూడాలి.

Tags:    

Similar News