మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పెంచుతున్న త్రివిక్రమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా ను వచ్చే నెలలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా ను వచ్చే నెలలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. అంటే విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే షూటింగ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు నెల ముందే ప్రారంభం అవుతున్నాయి. కనీసం రెండు నెలల ముందే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మెల్లగా చేస్తూ ఉంటారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇంకా కూడా షూటింగ్ ని పూర్తి చేయక పోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
మొన్నటి వరకు మహేష్ బాబు, మీనాక్షి చౌదరి కాంబోలో సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించారు. ఇప్పుడు యూనిట్ సభ్యులు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కేరళ వెళ్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్కడ రెండు వారాల చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు.
ఈ నెల చివరి వరకు షూటింగ్ కార్యక్రమాలే ఉండే అవకాశం ఉంది. జనవరి మొదటి వారం లేదా రెండో వారంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. గుంటూరు కారం సినిమాకు ఇప్పటికే కావాల్సినంత పబ్లిసిటీ దక్కింది. కనుక ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం లేదు అనే ఆందోళన అక్కర్లేదు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
మహేష్ కి జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కచ్చితంగా అనుకున్న సమయంకు వస్తుంది. ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఈ సినిమా మెప్పిస్తుందని నిర్మాత నాగ వంశీ పదే పదే చెబుతున్నారు. మహేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం పుష్కర కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.