ఒకేసారి రెండు ట్రైలర్స్.. కొత్త ట్రెండు
పాత్ర నచ్చితే డ్యురేషన్ ఎంతని ఆలోచించకుండా నటించే అతికొద్ది మంది నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు.
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఉప్పెన, విక్రమ్, జవాన్ వంటి పలు సినిమాల్లో విలన్‌గా మెప్పిస్తున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే డ్యురేషన్ ఎంతని ఆలోచించకుండా నటించే అతికొద్ది మంది నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలో బిజీబిజీగా గడుపుతున్నారు. అందులో మెర్రీ క్రిస్మస్ ఒకటి.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బద్లాపూర్, అంధాదూన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రిలీజైన టైటిల్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దాంతోపాటు రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు.
తమిళం, హిందీలో ఒకే కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ట్రైలర్లు మాత్రం వేర్వేరుగా విడుదల చేశారు మేకర్స్. హిందీ వెర్షన్ కాస్త స్పీడ్‌గా ఉంది. క్రిస్మస్ ముందు రోజు జరిగే మర్డర్ మిస్టరీ కమ్ లవ్‌ను హిందీ ట్రైలర్లో చూపించారు. విజయ్- కత్రిన లిప్ లాక్ సీన్‌ను యాడ్ చేశారు. అయితే ఈ మూవీ తమిళ ట్రైలర్లో కాస్త హోమ్లీ టచ్ ఉంది. లిప్ లాక్ సీన్‌ను ఈ ట్రైలర్లో మేకర్స్ యాడ్ చేయలేదు.
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చెందిన రెండు ట్రైలర్లు.. మూవీపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. శ్రీరామ్ రాఘవన్.. సినిమాలో ఫుల్ ట్విస్ట్‌లు, సర్ప్రైజ్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు ట్రైలర్లు సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఎందుకంటే ఒక చిత్రం నుంచి రెండు ట్రైలర్లు రిలీజ్ చేయడం ఇదే తొలిసారి.
మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటిస్తున్నారు. తమిళ వెర్షన్లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించనున్నారు. అయితే తెలుగులో ఈ సినిమా డబ్ కావడం లేదని సినీ వర్గాల టాక్.