ఉపాసనకి జర్నలిస్ట్‌ అవ్వాలనిపించిందట!

'కాల్‌ మీ బే' లో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే నటించింది.

Update: 2024-09-11 10:14 GMT

మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా ఆరోగ్యం గురించి, వ్యాపారం గురించి, సినిమాలు, ఆటలు ఇలా అన్ని రంగాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె తాజాగా ఒక వెబ్‌ సిరీస్ పై ప్రశంసలు కురిపిస్తూ, ప్రతి ఒక్కరు ఇలాంటి సిరీస్‌ ను చూడాలి అన్నట్లుగా సలహా ఇచ్చింది. చాలా రేర్‌ గా సినిమాలకు, సిరీస్ లకు ఉపాసన రివ్యూలు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చూసిన 'కాల్‌ మీ బే' అనే వెబ్‌ సిరీస్ కి రివ్యూ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి చూడాలి అనిపించేంతగా ఉపాసన సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని నెటిజన్స్ తో పంచుకున్నారు.

'కాల్‌ మీ బే' లో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే నటించింది. కొల్లిన్ డి కున్హా దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్ లో అనన్య పాండే విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించింది. ఒక ఒంటరి మహిళ గా అనన్య ను చూపించడం జరిగింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో పాటు, అందంగా కనిపించే పాత్ర అవ్వడం వల్ల అనన్య పాండే కు రెండు విధాలుగా కలిసి వచ్చింది. ఈ వెబ్‌ సిరీస్ కచ్చితంగా అమ్మాయిలకు మంచి మెసేజ్ ఇస్తుంది అంటూ చాలా మంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వెబ్‌ సిరీస్ చూసిన తర్వాత ఉపాసన సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ... అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన కాల్ మీ బే వెబ్‌ సిరీస్ నాకు బాగా నచ్చింది. సిరీస్‌ చూశాక నాకూ సోషల్‌ మీడియాలో జర్నలిస్ట్‌ కావాలనే కోరిక కలిగిందని పేర్కొంది. ఇలాంటి ఒక మంచి సిరీస్ ను రూపొందించినందుకు టీమ్‌ ను, నటించినందుకు అనన్య పాండేను ఉపాసన ప్రశంసించారు. ఉపాసన మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ వెబ్‌ సిరీస్‌ పై పాజిటివ్ గా స్పందించారు. ముఖ్యంగా సారా అలీ ఖాన్‌, ఆలియా, నేహా దుఫియా ఇంకా తదితరులు సోషల్‌ మీడియా ద్వారా ఈ సిరీస్ పై స్పందించారు.

ఈ సిరీస్ కథ ఒక మహిళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె తన డబ్బును పోగొట్టుకుని, భర్తకు దూరం అయి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఎదుర్కొనే మానసిక సంఘర్షణ మొదలుకుని అనేక విషయాలను సిరీస్ లో దర్శకుడు చూపించాడు. లీడ్‌ రోల్‌ లో కనిపించిన అనన్య పాండే పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆమె కు కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ హిట్ గా ఈ సిరీస్ నిలుస్తుంది. తెలుగు లో లైగర్ సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్‌ కే పరిమితం అయింది. ఈ సక్సెస్ తో కచ్చితంగా అనన్య బాలీవుడ్‌ లో బిజీ స్టార్‌ గా మారే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News