భారతదేశపు కిమ్ కర్ధాషియన్ అవ్వాలనుకుందట!
ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం అక్కర్లేదు. విలక్షణమైన ఫ్యాషన్ సెన్స్, బోల్డ్ యాటిట్యూడ్ తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది
ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం అక్కర్లేదు. విలక్షణమైన ఫ్యాషన్ సెన్స్, బోల్డ్ యాటిట్యూడ్ తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. మరోవైపు నటిగా సత్తా చాటేందుకు ఉర్ఫీ ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల `ఫాలో కర్ లో యార్` అనే వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. ఇంతకుముందే నిర్మాతలు విడుదల చేసిన ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ లభించింది.
ప్రైమ్ వీడియో ట్రైలర్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తన కుటుంబం, ఎంపికలు, ఫ్యాషన్ గురించి ఊర్ఫీ ఈ వీడియోలో మాట్లాడింది. తన ఫ్యాషన్ అవతార్ లకు సంబంధించిన గ్లింప్స్ ని ఇందులో చూపిస్తున్నారు. ఈ ట్రైలర్లో ఊర్ఫీ భారతదేశానికి తదుపరి కిమ్ కర్దాషియాన్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా, ఉర్ఫీ జావేద్ తన భయం, ఇతర భావోద్వేగాల గురించి మాట్లాడటం కనిపించింది. తాను భారతదేశపు తదుపరి కిమ్ కర్దాషియాన్ కావాలని కోరుకుంటున్నట్లు కూడా పేర్కొంది. ఫాలో కర్ లో యార్ ఆగస్టు 23న ప్రీమియర్ కానుంది. తొమ్మిది ఎపిసోడ్ల సిరీస్‌ని సోల్ ప్రొడక్షన్స్ ఫాజిలా అల్లానా - కామ్నా మెనెజెస్ నిర్మించారు. సందీప్ కుక్రేజా దర్శకత్వం వహించారు. భారతదేశంలో అతిపెద్ద వైరల్ సంచలనం ఊర్ఫీ జావేద్ శక్తివంతమైన, ఆకర్షణీయమైన జీవితంలోని ఫిల్టర్ లెస్ విషయాలను ఓపెన్ గా చూపిస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు.
ఊర్ఫీకి సోషల్ మీడియా వల్ల సంభవించిన ముప్పు గురించి, దాని వెలుపల తన జీవితం, కష్టతరమైన ప్రయాణం, లెక్కలేనన్ని అడ్డంకులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం.. వంటి ఎన్నో అంశాలను ఈ సిరీస్ లో ఆవిష్కరించారు. కుటుంబ జీవితంలో వర్కవుట్ కాలేదనే విషయాన్ని కూడా ఊర్ఫీ ఇందులో వెల్లడించనుంది.
ప్రైమ్ వీడియో, ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ మాట్లాడుతూ `ఫాలో కర్ లో యార్` అనేది ప్రపంచ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే.. ఆకర్షణీయమైన రియాలిటీ-ఫాలో సిరీస్ అని అన్నారు.