ఇదంతా మీ వల్లే.. అని ఎమోషనల్ అవుతున్న ఊర్వశి!

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి సోషల్ మీడియా ఉపయోగించే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Update: 2024-07-03 15:30 GMT

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి సోషల్ మీడియా ఉపయోగించే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ 2024లో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన టాప్ 10 భారతీయులలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో సుమారు 72.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశంలోనే అత్యధికంగా అభిమానులు ఫాలో అవుతున్న నటీమణులలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు ఈ ఘనత సాధించిన అతి తక్కువ వైశం వ్యక్తిగా కూడా ఊర్వశి రౌతేలా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యారు.

ఊర్వశి రౌతేలా ఫార్చ్ టాప్ 10 లిస్టులో ఎంట్రీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2013లో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ నెట్వర్క్ ఇప్పుడు 770 కోట్లు అని అంచనా. అయితే ఇది ఆమెకు వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు.. ఇందులోని ప్రతి రూపాయి ఆమె ఎంతో కష్టపడి సంపాదించింది. ఆమెకు ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఫాలోయింగ్ పలువురు టాప్ రేంజ్ బాలీవుడ్ సెలబ్రిటీలను ఎప్పుడో దాటేసింది. ఒకరకంగా చెప్పాలి అంటే కింగ్ కోహ్లీ, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే కూడా ఈమెకే ఇంస్టాగ్రామ్ లో ఫాలోయింగ్ ఎక్కువ.

Read more!

ఇదంతా ఆమె తన పట్టుదలతో, ఎంతో క్రమశిక్షణతో సాధించిన విజయం. గతంలో ఒకసారి ద యంగెస్ట్ ఇండియన్ అచీవర్ రికార్డ్ ఫోర్బ్స్ టాప్ 10 లిస్టులో ఈమె పేరు నమోదయింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ రికార్డులు పెరుగుతున్నాయి తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా భారత దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఊర్వశి రౌతేలా బాగా పాపులర్ అయింది.

ప్రస్తుతం చేతిలో ఎన్నో ప్రాజెక్ట్తో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్న ఊర్వశి రౌతేలా.. తన ఖాతాలో చేరిన మరొక అరుదైన రికార్డు గురించి ఎంతో మెరిసిపోయారు.” ఇది నేను ఎంతో కష్టపడి సొంతంగా సంపాదించుకున్నటువంటి అభిమానం. మీ అందరి సహాయం వల్లే నాకు ఇంత సక్సెస్ అందుతోంది. సోషల్ మీడియాలో మీరందరూ నా మీద చూపించేటటువంటి ప్రేమ, అభిమానం నన్ను ఎన్నో అవరోధాలను దాటించడంలో సహాయపడుతోంది.. ఈరోజు మీ అందరి సహకారంతోటే నేను ఈ అరుదైన గుర్తింపు తెచ్చుకోగలిగాను” అని ఊర్వశి రౌతేలా తను ఆనందాన్ని వ్యక్తీకరించారు.

అంతేకాదు తనని ఎంతగానో అభిమానించి ఆదరించే అభిమానులు ఎప్పుడూ తన పట్ల గర్వంగా ఉండేలా ప్రవర్తిస్తానని ఈ నేపథ్యంలో ఆమె పేర్కొన్నారు. తన అభిమానులు తనకు అందిస్తున్నటువంటి ప్రేమ ఆదరణ ఆమెకు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె గ్లోబల్ ఇండియన్ సూపర్ స్టార్ ఊర్వశి రౌతేలా, జెస్సీ గిల్ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇవి కాక అక్షయ్ కుమార్ నటిస్తున్న వెల్కమ్ 3, నందమూరి బాలకృష్ణ NBK109 లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ లోకూడా ఆమె నటిస్తున్నారు.

Tags:    

Similar News

eac