స్టార్ బోయ్ మీద బేబీ ఆశలు..!

ఐతే సక్సెస్ రావడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి.

Update: 2024-06-01 03:00 GMT

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆ సినిమాతో పాపులారిటీ పెంచుకుంది. ముందు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ఆ తర్వాత వెబ్ సీరీస్ లు చేసిన వైష్ణవి చైతన్య సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయగా ఫైనల్ గా బేబీతో ఒక భారీ సక్సెస్ అందుకుంది. అయితే తెలుగు అమ్మాయి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఈమధ్య కాలంలో ఇంత పెద్ద సక్సెస్ అందుకోవడం వైష్ణవి వల్లే అయ్యింది. ఐతే సక్సెస్ రావడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి.

బేబీ హిట్ పడగానే వైష్ణవికి ఆఫర్లు వరుస కట్టాయి. ఐతే వాటిల్లో ఏది కాదన్నా సరే అప్పుడే అమ్మడికి టెక్కు పెరిగిందని అనుకుంటారు అందుకే కాస్త మొహమాటంగానే సినిమాలు సైన్ చేస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడు నటించిన లవ్ మీ సినిమా ఈమధ్యనే రిలీజై నిరాశపరచింది. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమా గురించి దిల్ రాజు ఎంత గొప్పగా చెప్పినా సరే సినిమా చూసేందుకు ఆడియన్స్ ముందుకు రాలేదు.

బేబీతో హిట్ అందుకున్న వైష్ణవి క్రేజ్ కూడా ఈ సినిమాకు ఏమాత్రం పనిచేయలేదు. లవ్ మీ ఇఫ్ యు డేర్ అంటూ దెయ్యంతో ప్రేమకథ తో వచ్చిన ఈ సినిమా వైష్ణవి ఖాతాలో ఫ్లాప్ వచ్చేలా చేసింది. ఇక ఈ సినిమా తర్వాత అమ్మడు మళ్లీ వెంటనే హిట్ కొడితేనే కెరీర్ సెట్ రైట్ అవుతుంది. ప్రస్తుతం వైష్ణవి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న జాక్ సినిమాలో నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య రోల్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.

బేబీ సక్సెస్ వైష్ణవికి మంచి పేరు తెచ్చినా కెరీర్ లో ఆమె ఎంచుకునే కథలు చేసే సినిమాల మీదే తన భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. లవ్ మీ ఆల్రెడీ బ్యాడ్ మార్క్ పడేలా చేయగా జాక్ తో తిరిగి ఫాంలోకి వస్తుందేమో చూడాలి. వైష్ణవి చైతన్య మాత్రం కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ చాలా కామన్ అనే గట్ ఫీలింగ్ తో ఉంది. జాక్ తో సక్సెస్ అందుకుంటే మాత్రం ఇక మీదట సైన్ చేసే సినిమాల గురించి పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News