శ్రీలీల స్పీడ్ అందుకోవడానికి వైష్ణవ్ తేజ్ ప్రాక్టీస్
కాని శ్రీలీల ఓ వైపు బలమైన పాత్రలు చేస్తూనే కమర్షియల్ హీరోయిన్ గా కూడా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో డాన్స్ టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఇద్దరే కనిపిస్తున్నారు. ఒకరు సాయి పల్లవి, రెండు శ్రీలీల. వీరిద్దరూ డాన్స్ చేయడంలో పోటాపోటీగా ఉంటారు. అయితే సాయి పల్లవి సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. తన క్యారెక్టర్ లో బలం ఉంది అంటేనే మూవీస్ కి సైన్ చేస్తోంది. కాని శ్రీలీల ఓ వైపు బలమైన పాత్రలు చేస్తూనే కమర్షియల్ హీరోయిన్ గా కూడా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.
భగవంత్ కేసరితో సాలిడ్ హిట్ ని ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ డిసెంబర్ 24న ఆదికేశవ సినిమాతో వైష్ణవ్ తేజ్ కి జోడీగా ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ టాలెంట్ మరోసారి చూపించింది. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యి ఇప్పటికే మూడు సినిమాలు చేసిన డాన్స్ చేసే అవకాశం మాత్రం ఎక్కడా రాలేదు. అయితే ఆదికేశవలో మాత్రం డ్యూయెట్ లలో శ్రీలీలతో కలిసి డాన్స్ లు చేయాల్సి వచ్చింది.
ఇక ఆదికేశవలో వారిద్దరి మధ్య వచ్చే సాంగ్స్ లో డాన్స్ మూమెంట్స్ ని శ్రీలీల చాలా సునాయాసంగా చేసేసేది. కాని ఆమె స్పీడ్ ని అందుకోవడం కోసం వైష్ణవ్ తేజ్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడంట. అంతగా ప్రాక్టీస్ చేసి శ్రీలీలతో డాన్స్ ని మ్యాచ్ చేశాడు. ఇద్దరి డ్యూయెట్ సాంగ్ లో చూస్తే అందులో శ్రీలీల స్పీడ్ ని మ్యాచ్ చేస్తూ డాన్స్ చేయడానికి వైష్ణవ్ తేజ్ గట్టి ప్రయత్నమే చేశాడు.
ఈ కారణంగా విపరీతంగా కాళ్ళ నొప్పులు వైష్ణవ్ తేజ్ కి వచ్చేసాయంట. మూవీలో ఆ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం హీరోగా వైష్ణవ్ తేజ్ కష్టానికి తగ్గ ఫలితం వచ్చినట్లు అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గుంటూరు కారం సినిమా శ్రీలీల చేస్తోంది. ఈ మూవీలో కచ్చితంగా డ్యూయెట్ ఉంటుంది. దానిలో శ్రీలీలతో పోటీపడి మహేష్ బాబు ఏ స్థాయిలో డాన్స్ పెరర్మేన్స్ చేస్తాడు అనేది వేచి చూడాలి..
అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ మూవీలో ఆమెకి డాన్స్ చేసే స్కోప్ దొరకకపోవచ్చు. ఏది ఏమైనా శ్రీలీల డాన్స్ స్పీడ్ ని మ్యాచ్ చేయగల స్టార్స్ టాలీవుడ్ లో ప్రస్తుతం తక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. అందుకే కమర్షియల్ హీరోయిన్ గా టాలీవుడ్ ఆమె జోరు చూపిస్తోంది.