వాణీకపూర్ నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ వైరల్
అంతేకాదు ఇటీవల పూర్తిగా సైజ్ జీరో లుక్ లోకి మారిపోయాక ఆరోగ్యం ఫిట్ నెస్ పరంగాను ఈ బ్యూటీ చాలా ప్రయాసలు పడుతోందని అర్థమవుతోంది.
'వార్' బ్యూటీ వాణీ కపూర్ ఫ్యాషన్ సెన్స్ నేటితరానికి స్ఫూర్తి. నటన, డ్యాన్స్, ఫిట్నెస్ లేదా మోడలింగ్ ఏ కోణంలో చూసినా వాణి కపూర్ ని వేలెత్తి చూపలేం. తన అద్భుత నటనా నైపుణ్యంతో పాటు ఫ్యాషన్ సెన్స్, ప్రత్యేకమైన శైలి అందరికీ ఒక ప్రేరణ. పక్కింటి అమ్మాయి లుక్ అయినా బికినీ లుక్ అయినా వాణీ ప్రత్యేకత గురించి యూత్ మాట్లాడుతుంది.
తాజాగా వాణి కపూర్ బాడీకాన్ దుస్తులు ధరించి వంపులను ఆవిష్కరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. స్ట్రాపీ స్లీవ్‌లు, U-నెక్లైన్ టాప్ ధరించి బ్లాక్ కలర్ గాగుల్స్ తో వాణీ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. క్యూట్ అండ్ హాట్ పర్ఫెక్ట్ ఫ్యూజన్ లుక్ ఇది. ప్రస్తుతం ఈ గెటప్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. వాణీ ప్రతిసారీ లుక్ పరంగా వైవిధ్యం కోసం పాకులాడుతుంది. అంతేకాదు ఇటీవల పూర్తిగా సైజ్ జీరో లుక్ లోకి మారిపోయాక ఆరోగ్యం ఫిట్ నెస్ పరంగాను ఈ బ్యూటీ చాలా ప్రయాసలు పడుతోందని అర్థమవుతోంది.
వాణీ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ మూడు పాన్ ఇండియా చిత్రాల్లో వాణీ నటిస్తోంది. 2013లో రొమాంటిక్ కామెడీ చిత్రం 'శుద్ధ్ దేశీ రొమాన్స్'లో తన సినీ రంగ ప్రవేశం చేసిన వాణీ ఉత్తమ అరంగేట్ర నాయికగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత బేఫిక్రే చిత్రంలో తనదైన నటనతో మెప్పించింది. తెలుగులో ఆహా కళ్యాణం లో నటించినా కానీ సినిమా డిజాస్టరైంది. తెలుగుకు ఈ భామ సూట్ కాలేదని విమర్శల పాలైంది. ఆ తర్వాత యాక్షన్ చిత్రాలైన వార్ - బెల్ బాటమ్ లలో వానీ నటనకు ప్రశంసలు అందుకుంది. రొమాంటిక్ కామెడీ చిత్రం 'చండీగఢ్ కరే ఆషికి'లో లింగమార్పిడి మహిళగా అద్భుత నటనతో మరోసారి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో వాణీ పోషించిన పాత్ర అన్ని వర్గాల దృష్టిని ఆకర్షించింది. అలాగే లింగమార్పిడి అమ్మాయి పాత్రను పోషించిన ఏకైక ప్రముఖ బాలీవుడ్ నటిగా రికార్డులకెక్కింది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు ఇండస్ట్రీ వర్గాల నుంచి బోనస్ ప్రశంసలు కురిసాయి. 'చండీగఢ్ కరే ఆషికి' , షంషేరాలోను అద్భుతంగా నటించింది.
దినేష్ విజన్ ప్రాజెక్ట్ ... అషిమ్ అహ్లువాలియాతో అలాగే మరొకటి నిఖిల్ అద్వానీ ప్రొడక్షన్స్ తో సినిమాలు చేస్తోంది. ఇటీవల పలువురు దర్శకులు వినిపించిన కథలు విన్న వాణీ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందిట.