డ్ర‌గ్స్ కేసులో వ‌ర‌ల‌క్ష్మికి ఎన్ఐఏ నోటీసులు!

ఈ నేప‌థ్యంలో ఆదిలింగం గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డం కోసం న‌టి వ‌ర‌ల‌క్ష్మి కి విచార‌ణ‌లో భాగంగా ఎన్ ఐఏ స‌మ‌న్లు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది.

Update: 2023-08-29 11:37 GMT

కోలీవుడ్ న‌టి వ‌ర‌ల‌క్ష్మి కి కేర‌ళ డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి కొచ్చి ఎన్ ఐఏ అధికారులు నోటీసులు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. చాలా కాలంగా వ‌ర‌ల‌క్ష్మి వ‌ద్ద పీఏగా ప‌నిచేస్తోన్న ఆదిలింగం అనే వ్య‌క్తి డ్ర‌గ్స్ కేసులో కీల‌క నిందుతుడిగా ఉన్న‌ట్లు అధికారులు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఆదిలింగానికి అంత‌ర్జాతీయ డ్ర‌గ్ ముఠాల‌తో సంబంధాలున్న‌ట్లు అధికారుల వ‌ద్ద కొన్ని ర‌కాలా ఆధారాలుడ‌టంతో ద‌ర్యాప్తు వేగ‌వంత‌మైంది.

ఈ నేప‌థ్యంలో ఆదిలింగంని ఎన్ ఐ ఏ అధికారులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. డ్ర‌గ్స్ ద్వారా వ‌స్తోన్న ఆదాయాన్ని సినీ ప‌రిశ్ర‌మ‌లో పెట్టుప‌డి పెట్టిన‌ట్లు అధికారులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆదిలింగం గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డం కోసం న‌టి వ‌ర‌ల‌క్ష్మి కి విచార‌ణ‌లో భాగంగా ఎన్ ఐఏ స‌మ‌న్లు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారింది.

వ‌ర‌ల‌క్ష్మి ఎన్ ఐఏ విచార‌ణ నేప‌థ్యంలో ఆదిలింగం గురించి ఎలాంటి విష‌యాలు చెబుతారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆదిలింగం కాకుండా ఆయ‌న వెనుక ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నారు? ఇందులో ప‌రిశ్ర‌మ‌కి చెందిన వారు ఎవ‌రైనా ఉన్నారా? లేక సినిమా పేరుతో ఆదిలింగం చేసిన ప‌నులేంటో? ఎన్ ఐఏ నిగ్గు తేల్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే విచార‌ణ‌లో ఉన్న ఆదిలింగం నుంచి చాలా విష‌యాలు రాబ‌ట్టారు.

ఈ నేప‌థ్యంలో వ‌ర‌ల‌క్ష్మి కి నోటీసులు ఇవ్వ‌డం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి వ‌ర‌ల‌క్ష్మి విచార‌ణ‌లో ఎలాంటి ప్ర‌శ్న‌లు ఎదుర్కుంటారు? అన్న‌ది చూడాలి. ఇక న‌టిగా వ‌ర‌ల‌క్ష్మి తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన 'యశోద', 'వీరసింహారెడ్డి', 'మైఖేల్‌' లాంటి చిత్రాల్లోనూ న‌టించారు.

Tags:    

Similar News