భార్యతో సంథింగ్ స్పెషల్ దివాలీ!
మరికొంత మంది కరణ్ జోహార్ ఇంట వేడుకకు హాజరవుతుంటారు.
దివాలీ అంటే బాలీవుడ్ లో ఎంతో స్పెషల్. అక్కడ హీరోలు-హీరోయిన్లు అంతా ఒకే చోట కలిసి సెలబ్రేట్ చేసుకుం టారు. ముఖ్యంగా ఆ రోజు బిగ్ బీ అమితాబచ్చన్ ఇంట అతిధులైపోతారంతా. స్టార్ హీరోలు, హీరోయిన్లు అంతా ఆయన ఇంట్లో గేదర్ అవుతుంటారు. మరికొంత మంది కరణ్ జోహార్ ఇంట వేడుకకు హాజరవుతుంటారు. ఇది ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా జరుగుతుంది. అయితే టాలీవుడ్ హీరోలు అలా కాదు. ఎవరి ఫ్యామిలీ తో వారే వాళ్ల ఇళ్లలో సెలబ్రేట్ చేసుకుంటారు.
చాలా రేర్ గానే ఆ రోజు హీరోలంతా కలుస్తుంటారు. మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలంతా ఆ రోజు వీలుంటే కలిసే అవకాశం ఉంటుంది. లేదంటే లేదు. అయితే కొత్త దంపతులు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి మాత్రం దివాలీ కోసం చాలా ఎగ్జెట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అందులో వరుణ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా దివాలీ గురించి ఇలా మాట్లాడాడు.
`పెళ్లి తర్వాత లావణ్యతో తొలి దీపావళి ఇదే. అయితే ఇద్దరం రియల్ లైఫ్ లో జరుపుకుంటోన్న ఈవేడుక ఇంతకు ముందే రీల్ లైఫ్ లో జరుపుకున్నాం. అదెలా అంటారా? ఇద్దరం కలిసి `అంతరిక్షం`లో నటించాం. ఇంటిని దీపాలతో అలంకరించి ఆనందంగా గడిపే సీన్ ఒకటుంటుంది. దీపావళ్లి అనగానే నాకెప్పుడు అదే సీన్ గుర్తొస్తుంది. లావణ్య తెలుగు సంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తుంది. తెలుగు పండుగలు జరుపుకోవడం అంటే ఎంతో ఇష్టం.
ఇక్కడ ఉండే పండగలన్నీ జరుపుకుంటుంది. అందుకే ఈసారి దివాలీ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం` అన్నారు. మొత్తానికి కొత్త అల్లుడు అత్తారింటికి ఈ ఏడాది వెళ్లలేదని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠిది ఉత్తరాఖాండ్. డెహ్రాడూన్ లో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు..అన్నలు అంతా జడ్జ్ లు..లాయర్లే.