ఎక్స్ ట్రాలు చేస్తే ఇంట్లో తంతారు: వరుణ్ తేజ్
మెగా బ్రదర్స్ లో చిరంజీవి తప్ప మిగతా ఇద్దరు నాగబాబు, పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
మెగా బ్రదర్స్ లో చిరంజీవి తప్ప మిగతా ఇద్దరు నాగబాబు, పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ తన సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు. చేతిలో ఉన్న సినిమాలను పక్కన పెట్టి పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. అయితే మెగా కుర్ర హీరో వరుణ్ తేజ్ మరికొద్ది రోజుల్లో ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.
ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేఫథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. మార్చి 1వ తేదీన థియేటర్లోకి రానుంది. ఇప్పటికే నార్త్ లో ఫుల్ గా ప్రమోషన్స్ చేసిన వరుణ్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురవుతున్న ఏపీ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలపై క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా తన తండ్రి తరఫున ప్రచారం చేస్తారా లేదా అన్న ప్రశ్నకు స్పష్టంగా సమాధానమిచ్చారు.
"మీ నాన్న గారు ఏపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు కదా.. మరి మీరు ప్రచారం చేస్తారా?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇంతకుముందు కూడా తాను చేసినట్లు వరుణ్ తేజ్ తెలిపారు. 2014, 2019తో పోలిస్తే 2024 రాజకీయ పరిస్థితులు మారాయని, మరి ఈసారి ప్రచారంలో పాల్గొంటారా అన్న విషయానికి ఓపిగ్గా క్లారిటీ ఇచ్చారు వరుణ్. "ఒక విషయమేంటంటే.. మా ఇంట్లో ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు.. ఒక పౌరుడిగా ముందుకు మనకు ఎవరికి మద్దతు ఇస్తామన్న విషయంలో క్లారిటీగా ఉండాలి" అని వరుణ్ తెలిపారు.
"జాబ్ ప్రొఫైల్ ప్రకారం అందరూ మన సినిమాలు చూడాలి. సమాజంలో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎవరికి మద్దతు ఇస్తామే క్లారిటీ ఉన్నప్పుడు ఎవరు ఏం అన్నారో చేశారో అన్నది మ్యాటర్ కాదు. పవన్ కల్యాణ్ బాబాయ్ కు నేనొక ఫాలోవర్. బాబాయ్ అని కాదు.. ఒక వ్యక్తిగా ఆయన నన్ను చాలా ఇన్పైర్ చేశారు. ఆయనను చూసినప్పుడు కల్యాణ్ బాబాయ్ కే సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది. అయితే ప్రత్యక్ష ప్రచారం చేయాలో లేదో అనేది ఇంట్లో చెప్పాలి. అడక్కుండా ఎక్స్ ట్రాలు చేస్తే ఇంట్లో వాళ్లు తంతారు(నవ్వుతూ)" అని వరుణ్ చెప్పారు.
ఇటీవల మరో ప్రమోషన్ లో తన చెల్లి నిహారిక పొలిటికల్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు వరుణ్. ఏపీ ఎన్నికల్లో మెగా డాటర్ పోటీ చేస్తారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. మా కుటుంబమంతా బాబాయ్ కు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటుందని చెప్పారు. తాము ఏం చేయాలో పెద్దలు చెబితే చేయడానికి రెడీ అంటూ చెప్పారు. మరోవైపు, నాగబాబు టీడీపీ- జనసేన కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.