అమ్మ ప్రేమ అద్భుతం..అది ఇలా ఉంటుంది!
ఆమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది.
అమ్మ...! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా చెప్పలేనివి ఎన్నెన్నో. ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’. అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం. అమ్మను మించి దైవం ఉందా? అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అదెంత.
ఆమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అలాంటి అమ్మ ప్రేమను పొందిన వారంతా అదృష్టవంతులే కదా. తాజాగా వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన ఫోటో చూస్తే అమ్మ ప్రేమంతా నీకే సొంతం అన్నంత అద్భుతంగా ఈ ఫోటో ఉంది కదూ. వరుణ్ తేజ్ ని తన తల్లి పద్మజ ఎంతో ప్రేమతో ఇలా ముద్దాడుతూ కనిపించారు. వరుణ్ తేజ్ ఆ ప్రేమను అతే ఆస్వాదిస్తున్నాడు. అమ్మ ప్రేమ కమ్మదనాన్నంతటిని తన నవ్వులో చూపించాడు.
వరుణ్ తేజ్ పెళ్లి సందర్భంగా ఇద్దరు ఇలా కెమెరాకి చిక్కిన ఫోటో ఇది. వివాహ మనంతరం తనయుడి జీవితంలో కొత్త భాగస్వామి చేరుతుంది కాబట్టి! తల్లి ప్రేమనంతటని ఇలా చాటారు. నేడు మదర్స్ డే సందర్భంగా ఈ ఫోటోని వరుణ్ తేజ్ మరోసారి షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. తల్లీ-తనయుల ప్రేమను చూసి అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు. తల్లి ప్రేమనుపొందిన వరుణ్ ఎంతో అదృష్టవంతుడంటూ అభిమానులు మదర్స్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
మెగా ఫ్యామిలీలో మామ్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుదో ఈ సందర్భాన్నికూడా ఉదహరించొచ్చు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తోన్న సందర్భంగా వరుణ్ తేజ్ కూడా తన తల్లితో కలిసి నియోజక వర్గానికి వచ్చాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తల్లి సురేఖతో కలిసి పిఠాపురం ప్రచారంలో పాల్గొన్నసంగతి తెలిసిందే. ఇక ఈ హీరోలిద్దరు టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా కొనసాగుతోన్నసంగతి విధితమే.