మెగా వారసుడి తో 'ఆపరేషన్ వాలెంటైన్'
మెగావారసుడు వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వంలో పాన్ ఇండియాలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే
మెగావారసుడు వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వంలో పాన్ ఇండియాలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వరుణ్ నుంచి రాబోతున్న మరో వైవిథ్యమైన చిత్రదమి. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు జోడీగా మానుషి చిల్లర్ నటిస్తోంది. ఆమె రాడర్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో షర వేగంగా జరుగుతోంది.
వరుణ్ సహా ఇతర నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈసినిమా ఎలాంటి టైటిల్ పెట్టాలన్న అంశంపై మేకర్స్ ఓ నిర్ణయాని కి వచ్చినట్లు సమాచారం. స్టోరీకి తగ్గట్టు 'ఆపరేషన్ వాలెంటైన్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రకరకాల టైటిల్స్ అనుకున్నప్పటికీ స్టోరికీ ఈ టైటిల్ దగ్గరగా ఉందని..ఇదే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
మరి వాస్తవం ఏంటి? అన్నది యూనిట్ రివీల్ చేస్తే గానీ క్లారిటీ రాదు. ఈ సినిమా కోసం వరుణ్ లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు. బాడీలో అదనపు కొవ్వును పూర్తిగా కరిగించి కొత్తగా కనిపిస్తున్నాడు. ఎయిర్ ఫోర్స్ అధికారి లుక్ కోసం ప్రత్యేకమైన డైట్ ..శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమా నటుడిగా వరుణ్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ని తెస్తుందని చెప్పొచ్చు. వైవిథ్యమైన సినిమాలు ఆయనకు కొత్తేం కాదు.
ఓవైపు కమర్శియల్ చిత్రాలు చేసినా..ఇన్నోవేటివ్ ఐడియాల్ని ప్రోత్సహించడంలో వరుణ్ ముందుం టాడు. ఈ రేర్ క్వాలిటీ మెగా ఫ్యామిలీలో మిగతా హీరోలందరి నుంచి వరుణ్ ని వేరు చేస్తుంది. ఈ విషయంలో రామ్ చరణ్ కూడా వరుణ్ని ఎంతో మెచ్చుకుంటారు. తమదంతా కమర్శియల్ పంథా అయితే..వరుణ్ డిఫరెంట్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. త్వరలో వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి.