ఆగిపోయిన మెగా హీరో సినిమా.. మళ్ళీ ట్రాక్ లోకి..

ఇక చాలా రోజులు బ్రేక్ లో ఉన్న ఈ ప్రాజెక్టు మొత్తానికి మళ్ళీ సెట్స్ పైకి వచ్చినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత, జూన్ 12 నుండి హైదరాబాద్‌లో 'మట్కా' షూటింగ్ పునఃప్రారంభం కానుంది.

Update: 2024-06-07 10:01 GMT

వరుణ్ తేజ్ ఇటీవల వరుస పరాజయాలను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. దీనివల్ల అతని థియేట్రికల్ మార్కెట్ కొంత నష్టపోయింది. ఈ నేపథ్యంలో, అతని తదుపరి చిత్రం 'మట్కా'కి సంబంధించిన మేకర్స్ బడ్జెట్ విషయంలో సెకండ్ థాట్స్ కలిగి ఉన్నారనే టాక్ గట్టిగానే వచ్చింది. అయితే, వరుణ్ తేజ్ వారిని ఒప్పించి, బడ్జెట్ కట్ తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యేలా చేసుకున్నారని కూడా కథనాలు వెలువడ్డాయి.

ఇక ఆ గాసిప్స్ ఎంతవరకు నిజం అనేది మేకర్స్ ప్రమోషన్స్ లోకి దిగిన తరువాత తెలుస్తుంది. ఇక చాలా రోజులు బ్రేక్ లో ఉన్న ఈ ప్రాజెక్టు మొత్తానికి మళ్ళీ సెట్స్ పైకి వచ్చినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత, జూన్ 12 నుండి హైదరాబాద్‌లో 'మట్కా' షూటింగ్ పునఃప్రారంభం కానుంది. 'మట్కా' ఒక పీరియాడిక్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, మీనాక్షి చౌధరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్స్ నిర్మించబడ్డాయి. ప్రధానమైన సీన్స్ అన్ని కూడా ఈ సెట్లలోనే షూట్ చేయనున్నారు. నోరా ఫతేహి మరియు నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వారి పాత్రలో కూడా కథలో చాలా కీలకమైనవి అన్నట్లు తెలుస్తోంది.

మట్కా ప్రాజెక్టును వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'మట్కా' థియేట్రికల్ విడుదల ఎప్పుడు అనే విషయంలో అఫీషియల్ క్లారిటీ రాలేదు కానీ వచ్చే ఏడాది వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ నాన్-థియేట్రికల్ డీల్స్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మంచి రేటు పలికే విధంగా త్వరలోనే అప్డేట్స్ ద్వారా బజ్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్టైలిష్ మాస్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం మరియు నేపథ్య సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. పాటలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత చిత్రాల వైఫల్యం తర్వాత, 'మట్కా'తో ప్రేక్షకులను అలరించాలన్న ఆతని కోరిక. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ డ్రామా, మాస్ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందుతోంది. దర్శకుడి కెరీర్ కు కూడా ఈ సినిమా చాలా ముఖ్యమైంది.

మేకర్స్ బడ్జెట్ కట్ తర్వాత కూడా, సినిమా ప్రొడక్షన్ విలువలను తగ్గించకుండా, విభిన్న సెట్లలో షూటింగ్ చేసి, స్టైలిష్ లుక్ ను కల్పిస్తున్నారు. ఈ సారి 'మట్కా' సినిమాతో వరుణ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడా? అతని కెరీర్ మరల పుంజుకునే అవకాశాన్ని అందుకుంటాడా? అనేది ఆసక్తికరంగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News