మెగా హీరో మరో రిస్క్?
ఇదిలా ఉండగా, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, దర్శకుడు విక్రమ్ సిరికొండ నూతన స్క్రిప్ట్ ని వరుణ్ తేజ్ ఓకే చేసినట్లు సమాచారం.
మెగా ఫ్యామిలీ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒక రేంజ్ లో ఉండగా మిగతా హీరోలు ఇంకా వారికంటూ ఒక బలమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ ప్రయోగాలు చేస్తున్నా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇటీవల కాలంలో అతను చేసిన సినిమాలు పెద్దగా లాభాలు అందించలేదు. మొదట్లో అతనికి తొలిప్రేమ, ఫిదా లవ్ స్టోరీలు బిగ్ హిట్స్ ఇచ్చాయి.
అయితే 'తొలిప్రేమ' తర్వాత అతని ఫ్యాన్స్ ఎదురుచూసిన ప్రేమకథా చిత్రాలు కాకుండా గద్దలకొండ గణేష్, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి సీరియస్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, అతని తదుపరి ప్రాజెక్ట్ 'మట్కా' కూడా సీరియస్ కథతో వస్తోంది. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, దర్శకుడు విక్రమ్ సిరికొండ నూతన స్క్రిప్ట్ ని వరుణ్ తేజ్ ఓకే చేసినట్లు సమాచారం.
విక్రమ్ సిరికొండ గతంలో రవితేజ 'టచ్ చేసి చూడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ వరుణ్ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. లవ్ స్టొరీ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆ సినిమా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాస్టింగ్ ప్రిపరేషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
అయితే వరుణ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా దర్శకులను నమ్ముతున్నాడు. గాండీవధారి అర్జున సినిమాను డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు కూడా అంతకుముందు కొన్ని సినిమాలతో డిజాస్టర్ చూశాడు. ఇక ఆపరేషన్ వాలెంటైన్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ కూడా న్యూ కమర్. ఇక గని దర్శకుడు కిరణ్ కు అదే మొదటి సినిమా. కొత్త దర్శకులు డిజాస్టర్ లో ఉన్న దర్శకులతో వరుణ్ ఈమధ్య సక్సెస్ చూడడం లేదు.
అయినప్పటికీ వరుణ్ అవేమి పట్టించుకోకుండా వారి టాలెంట్ ను నమ్ముతున్నాడు. మరి విక్రమ్ సిరికొండ అయినా వరుణ్ తేజ్ తో హిట్ సినిమా చేస్తాడో లేదో చూడాలి. ఇక 'మట్కా' సినిమా చిత్రీకరణ మరో షెడ్యూల్ హైదరాబాద్ లో జూన్ 19 ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తో పాటు నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఎస్ఆర్టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ హైపైన సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి.