కుర్ర భామ భార్య...సీనియర్ ప్రేయసిగానా!
విక్టరీ వెకంటేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `సంక్రాంతికి వస్తున్నాం` అనే సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే
విక్టరీ వెకంటేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `సంక్రాంతికి వస్తున్నాం` అనే సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాలి. కానీ అనీల్ ఇంకా సీన్స్ కి సంబంధించి డైలాగ్ వెర్షన్ పూర్తి చేయలేదు. స్క్రిప్ట్ సిద్దమైనా డైలాగులు రెడీగా లేకపోవడంతో దీంతో డిలే అవుతుంది. అయితే ఇప్పుడా పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది.
ఇందులో వెంకటేష్ కి జోడీగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసారు. ఇందులో ఆమె వెంకటేష్ భార్య పాత్ర పోషిస్తుందిట. కానీ ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం భారీగా ఉంది. వెంకటేష్ వయసు 63 కాగా, మీనాక్షి వయసు ఆయనలో సగం కూడా లేదు. అంటే మీనాక్షికి ఇంకా 30 ఏళ్లు కూడా లేవు. ప్రస్తుతం ఆమె వయసు 27 ఏళ్లు. అయినా ఆ పాత్రకు సరితూగే నాయికని అనీల్ ఆమెని ఎంపిక చేసాడు. అలాగే ఇందులో వెంకీకి జోడీగా మరో హీరోయిన్ కూడా ఉంది.
ఆమె సీనియర్ భామ అట. ఆ పాత్రకి 35 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండే స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేస్తారుట. ఇది ప్రియురాలు రోల్ అని సమాచారం. ఆ పాత్రకి ఫాంలో ఉన్న భామనే తీసుకోవాల నుకుంటున్నాడుట. హీరోయిన్ల విషయంలో అనీల్ ఇలా వ్యవహరిస్తున్నాడంటే? కథ లో వాళ్ల పాత్రలు అంతే బలంగా ఉంటాయని తెలుస్తోంది. అనీల్ సినిమాలో హీరో పాత్ర ఒక్కటే హైలైట్ కాదు.
ప్రతీ పాత్రని హైలైట్ చేస్తాడు. ముఖ్యంగా హీరోయిన్ల పాత్రలని సైతం హీరోలకు ధీటుగా చూపించడం ఆయన ప్రత్యేకత. వెంకీ కోసం 27 ఏళ్ల భామని హీరోయిన్ గా తీసుకున్నాడంటే? దాని వెనుక ఓ లాజిక్ ఉంటుంది. స్క్రిప్ట్ అలా డిమాండ్ చేయడంతోనే ఆ ఛాన్స్ తీసుకుని ఉంటాడు. మరి వెంకీ కోసం వచ్చే ఆ సినియర్ భామ ఎవరు? అవుతారు అన్నది చూడాలి. ప్రస్తుతం వెంకటేష్ రానా నాయుడు -2 వెబ్ సిరీస్ షూట్ లో బిజీగా ఉన్నారు.