'చారి 111' స్టైలిష్ థీమ్ సాంగ్.. వెన్నెల కిశోర్ ఆపరేషన్ రుద్రనేత్ర!
ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేసిన 'చారి 111' థీమ్ సాంగ్ లిరికల్ వీడియో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది
కమెడియన్ 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై కామెడీ 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించింది. విడుదలకి సిద్ధమైన ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా 'చారి 111' థీమ్ సాంగ్ ను ఆవిష్కరించారు.
''ఒక కన్ను భూగోళం.. ఒక కన్ను ఆకాశం..విశ్వాన్ని వెతికేద్దాం పదా.. శిఖరాలు తొలిచేద్దాం.. సంద్రాలు వడపోద్దాం.. కాలాన్ని కనిపెడదాం" అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె కింగ్ మంచి స్టైలిష్ ట్యూన్ కంపోజ్ చేశారు. సినిమా నేపథ్యానికి, హీరో క్యారెక్టరైజేషన్ కు తగ్గట్లుగా సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. 'జవాన్' ఫేమ్ సింగర్ సంజీత భట్టాచార్య అద్భుతంగా ఆలపించారు.
'చారి 111' సినిమాలో ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా స్టైలిష్ స్పై లుక్ లో కనిపించారు వెన్నెల కిషోర్. తన ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్ తో అలరించారు. ఎలాంటి సీరియస్ ఆపరేషన్ అయినా తన సిల్లీ మిస్టేక్స్ తో కామెడీగా మార్చేసే ఏజెంట్ బ్రహ్మచారిగా అతని పాత్రను ట్రైలర్ లో పరిచయం చేశారు. అయితే ఇప్పుడు ఈ థీమ్ సాంగ్ ద్వారా 'చారి 111' సినిమా ఆపరేషన్ రుద్ర నేత్ర చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇది కచ్ఛితంగా ఒక స్పై కామెడీకి కావాల్సిన సాంగ్ అని చెప్పాలి.
ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేసిన 'చారి 111' థీమ్ సాంగ్ లిరికల్ వీడియో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో చాలా రిచ్ గా ఉన్నాయి. భారీ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారని ఈ సాంగ్ చూస్తే అర్థమవుతోంది. సినిమాలో ఈ ఒక్క పాటే ఉండగా.. దీన్ని స్టార్టింగ్ టైటిల్స్‌లో, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
'చారి 111' సినిమాలో వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్ లతో పాటుగా మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కషిష్ గ్రోవర్ సినిమాటోగ్రఫీ నిర్వహించిన ఈ చిత్రానికి రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటింగ్ చేశారు. అక్షత బి హొసూరు ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోని నిర్మించారు. ఈ సినిమా మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.