పుట్టిన రోజునా అదే విషాదంలో...!

తమిళ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన హీరో విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు నేడు.

Update: 2024-07-24 10:10 GMT

తమిళ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన హీరో విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు నేడు. సాధారణంగా విజయ్ ఆంటోనీ పుట్టిన రోజున ఫ్యాన్స్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తెగ హడావిడి చేస్తూ ఉండేవారు. కానీ ఈ పుట్టిన రోజున మాత్రం విజయ్ ఆంటోనీ ఇంట విషాద ఛాయలు కనిపిస్తున్నాయి.

ప్రతి ఏడాది పుట్టిన రోజు సందర్భంగా విజయ్ ఆంటోనీ ఇంటి ముద్దు పెద్ద ఎత్తున అభిమానుల సందడి ఉండేది. కానీ ఈసారి మాత్రం అలాంటివి ఏమీ లేక పోవడంతో పాటు, కనీసం చిన్న చిన్న వేడుకలు కూడా ఎక్కడ లేవు. అందుకు కారణం గత ఏడాది విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకోవడమే.

గత ఏడాది సెప్టెంబర్‌ 19న విజయ్ ఆంటోనీ కూతురు మీరా 16 ఏళ్ల వయసులో ఇంట్లో ఆత్మ హత్య చేసుకుంది. ఇంటర్ వయసులోనే చనిపోయిన మీరా జ్ఞాపకాల నుంచి విజయ్‌ ఆంటోనీ ఇంకా బయటకు రాలేక పోతున్నాడు. తన సినిమాల్లో కూడా నిర్మాత పేరును మీరా అంటూ టైటిల్‌ కార్డ్‌ వేయించిన విజయ్ ఆంటోనీ దుఃఖం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

కూతురు పోయిన బాధ నుంచి తేరుకోకుండానే సినిమా షూటింగ్ కు హాజరు అయ్యాడు, ఆయన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.. కానీ పుట్టిన రోజు మాత్రం రెగ్యులర్ గా జరుపుకునే విధంగా జరుపుకోవడం లేదని తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి.

మీడియా వారు పలువురు విజయ్ ఆంటోనీ కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రయత్నించారు. అందులో కొందరిని కలిసిన విజయ్‌ ఆంటోనీ వారితో కొద్ది సమయం ముచ్చటించాడట. ఆ సమయంలో ఆయన మొహంలో నవ్వు లేక పోవడంతో పాటు చాలా విచారంగా కనిపించారట. విజయ్‌ ఆంటోనీ ఇంకా ఎన్నాళ్లకు ఆ విషాదం నుంచి బయటకు వస్తాడో అని ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News