హీరో టంగ్ స్లిప్.. వాళ్ల ఎటాక్ తో క్షమాపణ..!
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కాలంలో ఎవరు ఏ చిన్న మాట నోరు జారినా దాన్ని చీల్చి చెండాడేందుకు రెడీగా ఉంటున్నారు నెటిజన్లు
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కాలంలో ఎవరు ఏ చిన్న మాట నోరు జారినా దాన్ని చీల్చి చెండాడేందుకు రెడీగా ఉంటున్నారు నెటిజన్లు. జస్ట్ పొరపాటుగా కూడా ఒక మాట అంటే దాన్ని పట్టుకుని ఎటాక్ చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇక ఏదైనా విషయంలో అలా టంగ్ స్లిప్ అయ్యారు అంటే మీడియా కూడా ఆటాడేసుకుంటుంది. అలాంటి ఛాన్స్ కోసం ఎదురుచూసే మీమర్స్ కూడా వారి వీర ప్రతాపం చూపించేస్తారు. అందుకే మైక్ ముందున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అంటే కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని లేటెస్ట్ గా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతను చేసిన కామెంట్స్ కొందరిని హర్ట్ అయ్యేలా చేశాయి. దాంతో ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
అసలు విషయం ఏంటంటే తమిళ హీరో విజయ్ ఆంటోని అదే బిచ్చగాడు సినిమాతో సంచలనం సృష్టించిన అతను సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం అతను రోమియో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మద్యపానం గురించి స్పీచ్ ఇచ్చాడు. మందు తాగడంలో మగ ఆడా అనే తేడా ఏం లేదు.. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా క్రీస్తు కూడా ద్రాక్ష రసం తాగేవాడని అన్నాడు. అంతే ఆ మాట క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తినేలా చేసింది. విజయ్ ఆంటోని చేసిన కామెంట్స్ కు తమిళనాడు క్రైస్తవ సంఘాలు ఎటాక్ చేస్తున్నాయి. విజయ్ ఆంటోని క్షమాపణ చెప్పాలని లేదంటే పెద్ద గొడవ చేస్తామని ప్రకటించారు. అయితే తప్పు తెలుసుకున్న విజయ్ ఆంటోని వెంటనే సరిదిద్ధుకున్నాడు.
తను చేసిన కామెంట్స్ వల్ల ఇబ్బంది పడ్డ క్రైస్తవులకు క్షమాపణ చెప్పాడు. ద్రాక్ష రసం తాగడం అనే 2000 ఏళ్ల నుంచి ఉందని.. గుళ్లు, చర్చీల్లో కూడా అది వాడారని చెప్పాను.. అయితే తన కామెంట్స్ ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. అయినా సరే తన కామెంట్స్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అంటూ ఒక నోట్ రిలీజ్ చేశాడు విజయ్ ఆంటోని. సినిమా వాళ్లు ఏం మాట్లాడినా అదో సెన్సేషన్ అవుతుంది. అందుకే కులాలు, మతాలు గురించి వారు ఆచి తూచి మాట్లాడాల్సి ఉంటుంది.
విజయ్ ఆంటోని జస్ట్ టంగ్ స్లిప్ అయ్యి చేసిన కామెంట్స్ ఇప్పుడు అతన్ని క్రైస్తవులంతా ఎటాక్ చేసేలా చేసింది. అయితే వెంటనే తప్పు తెలుసుకున్న విజయ్ ఆంటోని వారి సారీ చెప్పి సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. మైక్ ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తర్వత ఇలానే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందని చెప్పొచ్చు.