దళపతి.. అటు ఇటు తిరిగి చివరికి అతని వద్దకే..
తమిళనాడులో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ డీఎంకే మాత్రమే బలంగా ఉంది.
ఇళయదళపతి విజయ్ రాజకీయాలలోకి వెళ్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పార్టీ పేరుని కూడా ఇప్పటికే ఖరారు చేశారు. తమిళంగ వెట్రి కజగం పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఆ పార్టీ పేరుతో రాజకీయ ప్రకటనలు కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ డీఎంకే మాత్రమే బలంగా ఉంది. మరోవైపు అన్నా డిఎంకేకి నాయకత్వ సమస్యలో పడింది.
దీంతో తమిళనాడులో ఉన్న పొలిటికల్ స్పేస్ ని తాను ఉపయోగించుకోవాలని విజయ్ అనుకుంటున్నారు. అందుకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు. పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్న నేపథ్యంలో సినిమాలకి స్వస్తి చెబుతున్నట్లు విజయ్ ప్రకటించారు. ఇక చివరగా చేసే సినిమాలు బలంగా ఉండాలని విజయ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ గ్రేట్ అఫ్ ఆల్ టైమ్(GOAT) అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా టైం ట్రావెల్ కథతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. మూవీలో విజయ్ రెండు భిన్నమైన పాత్రలలో రెండు టైం లైన్స్ లో కనిపిస్తాడంట. ఈ సినిమా షూటింగ్ మేగ్జిమమ్ చివరి దశకి వచ్చేసింది. విజయ్ కెరియర్ లో కంప్లీట్ గా డిఫరెంట్ జోనర్ లో చేస్తోన్న మూవీ ఇది కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.
దీని తర్వాత మరొక సినిమా మాత్రమే చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతని చివరి సినిమా డైరెక్టర్ ఎవరవుతారా అనే ప్రశ్న గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ టైంలో చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా వినిపించింది. అలాగే మరికొందరి పేర్లు ప్రముఖంగా చర్చకి వచ్చాయి. అయితే ఇప్పుడు విజయ్ ఆఖరి సినిమా డైరెక్టర్ కన్ఫర్మ్ అయ్యాడంట.
హెచ్ వినోత్ దర్శకత్వంలో విజయ్ చివరి మూవీ చేయబోతున్నాడంట. చాలా కాలంగా ఈ దర్శకుడు విజయ్ తో వర్క్ చేయాలని చూస్తున్నాడు. గత ఏడాది కూడా రెండు కథలు వినిపించగా విజయ్ పెద్దగా ఆసక్తి చూపలేదట. వినోత్ అజిత్ తో నెర్కొండ పర్వ, వాలిమై సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ గా మళ్ళీ అతను చెప్పిన కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.
అతను కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ పాయింట్స్ ను కూడా అద్భుతంగా ప్రజెంట్ చేయగలడు. అందుకే విజయ్ మనసు వినోత్ వైపు యూ టర్న్ తీసుకున్నట్లు టాక్. ఇక ఈ సినిమాపై త్వరలో అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. హెచ్ వినోత్ తో మూవీ పూర్తి చేసి వచ్చే ఏడాది నుంచి రాజకీయాలపై విజయ్ దృష్టి పెట్టబోతున్నాడంట. అయితే హెచ్ వినోత్ విజయ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేసి ఒప్పించాడు. ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎవరు నిర్మిస్తారు అనే వివరాలు పూర్తిగా బయటకి రాలేదు.