పాన్ ఇండియా ERAలో హీరో కావడం నా అదృష్టం

పాన్ ఇండియా స్టార్ గా విజయ్ త‌న హోదా గురించి 'ఖుషి' ప్ర‌మోష‌న్స్ లో మాట్లాడారు. తాను పాన్ ఇండియా యుగం (ఎరా)లో హీరోని అవ్వ‌డం త‌న అదృష్ట‌మ‌ని అన్నారు.

Update: 2023-08-10 15:14 GMT

అర్జున్ రెడ్డి -లైగర్ చిత్రాల‌తో పాన్ ఇండియా నటుడిగా రూపాంత‌రం చెందాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. దక్షిణాది నుండి వచ్చిన కొద్దిమంది పాన్ ఇండియా స్టార్ల‌లో దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా విజయ్ త‌న హోదా గురించి 'ఖుషి' ప్ర‌మోష‌న్స్ లో మాట్లాడారు. తాను పాన్ ఇండియా యుగం (ఎరా)లో హీరోని అవ్వ‌డం త‌న అదృష్ట‌మ‌ని అన్నారు.

ప్రస్తుతం దక్షిణాది నుంచి అన్ని భాషల సినిమాలు బాగా వసూళ్లు రాబడుతున్నాయి. దురదృష్టవశాత్తూ బాగా ఆడని సినిమా కంటెంట్‌పైనా నాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించిన ప్రేమకథ బహుళ భాషల్లో విడుదలవుతోంది. ప్ర‌స్తుత‌ స్థానంలో ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను... అని విజ‌య్ అన్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌- స‌మంత జంట‌గా శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఖుషి' త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని రవిశంకర్ వై నిర్మించారు. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ .. రాహుల్ రామకృష్ణ త‌దిత‌రులు న‌టించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రానుంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... విజయ్ తదుపరి చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీత గోవిందం త‌ర్వాత ద్వితీయ ప్ర‌య‌త్న‌మిది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోను విజ‌య్ న‌టించ‌నున్నాడు.

Tags:    

Similar News