హిందీ భాషపై హీరో రగడ ఠారెత్తిపోయిందిగా!
కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషపై వ్యతిరేక భావనలు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే.
కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషపై వ్యతిరేక భావనలు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తమిళనాడు ప్రజలు పెద్ద ఎత్తు ఉద్యమం కూడా చేసారు. హిందీని అనుకరించి తాము బానిసలం కామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏకంగా స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. హిందీ ఆధిపత్యం తమకు అంగీకారయోగ్యం కాదని ..హిందీ భాషను అనుకరించడం అంటే తాము బానిసలుగా మారినట్టేనని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
తాజాగా ఈ వివాదాస్పద అంశం తమిళ నటుడు విజయ్ సేతుపతి ముందుకెళ్లింది. ప్రస్తుతం ఆయన హీరోగా..కత్రినాక కైఫ్ కలిసి `మేరి క్రిస్మస్` అనే చిత్రాన్ని హిందీ..తమిళ్ లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసుకుని జనవరి 12న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిందీ గురించి విజయ్ పై ప్రశ్నలు సంధించారు.
పదే పదే ఒకే ప్రశ్న అడగొద్దు అంటూ విజయ్ అసంతృప్తిని వ్యక్తం చేసాడు. 75 ఏళ్లుగా తమిళ రాజకీయాలు హిందీ భాష వ్యతిరేకత చుట్టూ అల్లుకున్న విషయాన్ని ప్రస్తావించారు. కొందరు ఇప్పటికీ నాకు హిందీ రాదు అని రాసున్న టీషర్టులు ధరించడాన్ని పేర్కొన్నారు. వాటికి విజయ్ స్పందిస్తూ... `ఓ భాషగా హిందీని ఎవరూ వ్యతిరేకించలేదు అనగా ఇంతలోనే రిపొర్టర్ అడ్డుపడి భాష నేర్చుకోవడం తప్పనిసరా? అని ప్రశ్నించారు.
దీంతో విజయ్ సేతుపతి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే ప్రశ్న మీరు అమీర్ ఖాన్ ని అడిగినట్లు గుర్తు. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతారు. హిందీ భాషకు మేం వ్యతిరేకం కాదు. ఆ భాషను తప్పనిసరి చేయడంపైనే మా వ్యతిరేకత. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. చాలా మంది ఇప్పటికీ హిందీ నేర్చుకుం టున్నారు. నేర్చుకోవద్దు అని ఎవరు చెప్పలేదు. మీరు అడిగింది అనవసరమైన ప్రశ్న` అంటూ బధులిచ్చారు.