500 వందల స్టోరీలు విని 50 సినిమాలో చేసిన విలక్షణ నటుడు

సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నప్పటికీ ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి అద్భుతమైన నటులు కొంతమంది ఉంటారు

Update: 2024-06-13 06:46 GMT

సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నప్పటికీ ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి అద్భుతమైన నటులు కొంతమంది ఉంటారు. ఇచ్చిన పాత్రలో జీవించి.. ప్రేక్షకుల మనసుకు హత్తుకు పోయే విధంగా పర్ఫామెన్స్ ఇచ్చే నటుడు విజయ్ సేతుపతి. అందుకే తెరపై అతను నటించిన పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్ప అతను కనిపించడు. విలక్షణమైన ఈ నటుడు 50వ సినిమా మైలురాయి దాటాడు. ఈ నేపథ్యంలో నటుడిగా ఎదిగే సమయంలో అతని జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో కీలక విషయాల గురించి చర్చించారు.

ఒకవైపు హీరోగా నటిస్తూ.. మరోవైపు అగ్ర తారల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు విజయ్ సేతుపతి. హీరోగా చేస్తూ మరొకరి సినిమాలో విలన్ గా మెప్పించే టాలెంట్ ఉన్న నటుడు విజయ్ సేతుపతి. తమిళ్, తెలుగు సినిమాలతో పాటు హిందీలో కూడా తనదైన ప్రతిభ చాటుతున్నాడు. అతను నటించిన 50వ చిత్రం మహారాజు ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరులతో ముచ్చటించారు.

తాను చేసిన సినిమాల గురించి మాట్లాడిన విజయ్ సేతుపతి తన సినిమా జర్నీ అద్భుతంగా సాగుతోంది అని అన్నారు. అయితే 500 కు పైగా సినిమాల స్టోరీ విన్న అతను కేవలం 50 సినిమాలు మాత్రమే చేశారట. “ఎంతోమందిని కలిశాను.. హిట్స్‌తో పాటుగా ఫ్లాప్స్‌ని కూడా చూశాను.. ఫలితం ఏదైనా అది నాకు ఎప్పటికీ ఒక గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని చెప్పాలి.. ఇది చాలా వండర్ఫుల్ జర్నీ అనడంలో డౌట్ లేదు.. “ అని విజయ్ సేతుపతి అన్నారు.

అంతేకాదు ఇప్పటివరకు ఎన్నో రకాల సినిమాలలో ఎన్నో రకాల క్యారెక్టర్లు చేశాను అన్న విజయ్.. మహారాజులో చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుందని పేర్కొన్నారు. తాను చేసిన ప్రతి పాత్ర సహజంగా ఉంటుంది అని అందరూ మెచ్చుకుంటారని, అయితే పాత్రలో సహజత్వం రావడం కోసం అతను ఎంతో హోంవర్క్ విజయ్ సేతుపతి తెలిపారు. అంతేకాదు విజయ్ సేతుపతి తాను చేయబోయే పాత్రల గురించి ఎంతో రీసెర్చ్ చేయడంతో పాటు డైరెక్టర్‌తో చాలా లోతుగా చర్చిస్తారట. అంత శ్రమ తీసుకుంటారు కాబట్టి స్క్రీన్ పై అతను చేసే పాత్ర ప్రేక్షకుల మనసులో ముద్ర పడిపోతుంది.

ఇక తాను నటించిన 50వ చిత్రం మహారాజు గురించి మాట్లాడుతూ.. “నాకు కథ విన్నప్పుడే చాలా ఆసక్తికరంగా అనిపించింది. కథకంటే కూడా ఈ చిత్రంలో కథనం నాకు బాగా నచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ స్టోరీ నాకు పిజ్జా మూవీని గుర్తు చేసింది. ఇందులో అంత ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. అందుకే డైరెక్టర్ ఈ స్టోరీ చెప్పిన వెంటనే ఇది నా 50వ సినిమా అని ప్రకటించేసాను…”అని విజయ్ సేతుపతి అన్నారు. భారీ అంచనాల మధ్య రేపు థియేటర్లలో విడుదల కాబోతున్న మహారాజు చిత్రం ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News