సూపర్ స్టార్ చివరిది.. సమంతకు రీ ఎంట్రీ!
తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే
తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల రాజకీయ అరంగేట్రం గురించి అధికారికంగా ప్రకటన చేసిన విజయ్ ఇక మీదట సినిమాలు చేయక పోవచ్చు అని ప్రచారం జరుగుతోంది.
గోట్ సినిమా తర్వాత సినిమాను ఇప్పటికే కమిట్ అయ్యాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా ప్రకటన ఇప్పటికే వచ్చింది కనుక ఆ సినిమాను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న సినిమా చివరిది అయ్యి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తోంది.
విజయ్ కి చివరి సినిమా అంటే కచ్చితంగా చాలా స్పెషల్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఆ స్పెషల్ మూవీలో స్పెషల్ హీరోయిన్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఏడాది కాలంగా కెమెరా కు దూరంగా ఉంటున్న సమంతను ఏరి కోరి మరీ సంప్రదించారు అనే టాక్ తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది.
సమంత రీ ఎంట్రీ విజయ్ చివరి సినిమాతో అయితే కచ్చితంగా కోలీవుడ్ చరిత్రలో నిలిచి పోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగు లో మరియు హిందీలో ఇప్పటికే సమంత రీ ఎంట్రీ సినిమాలు కన్ఫర్మ్ చేసింది. విజయ్ తో చేయబోతున్న సినిమా కోలీవుడ్ లో రీ ఎంట్రీ మూవీ అవ్వబోతుంది.
విజయ్ మరియు సమంత కాంబో లో గతంలోనే సినిమాలు వచ్చాయి. కనుక ఇప్పుడు వీరి కాంబో కచ్చితంగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వినోద్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.