ప్రభాస్.. అతనికి లక్కీ ఛాన్స్

ఇటీవల 'సలార్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసింద

Update: 2024-01-26 11:39 GMT

ఇటీవల 'సలార్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్కి, రాజా సాబ్ సినిమా షూటింగ్స్ చివరి దశలో లో ఉండగా వీటితోపాటు సీతారామం మూవీ ఫేమ్ హనురాఘవపూడితో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

డైరెక్టర్ హను రాఘవపూడి ప్రభాష్ కోసం వరల్డ్ వార్ నేపథ్యంలో సాగే ఓ ఎమోషనల్ లవ్ స్టొరీని రెడీ చేశారని, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ లవ్ డ్రామాగా ఈ ప్రాజెక్టు ఉంటుందని ఇప్పటికే వార్తలు బయటకు రాగా ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ప్రభాస్ తన కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రాజెక్టు పట్టాలక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. ప్రభాస్ - హను రాఘవపూడి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది. సీతారామం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్ ప్రభాస్ - హను రాఘవపూడి సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని విశాల్ చంద్రశేఖర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రభాస్, హను ప్రాజెక్ట్ నేనే చేస్తున్నానంటూ స్వయంగా తెలపడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. విశాల్ చంద్రశేఖర్ ఒక్క సీతారామం సినిమాకే కాకుండా హనురాఘవపూడి డైరెక్ట్ చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, పడి పడి లేచే మనసు వంటి సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఈ సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాకి ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతుండడం విశేషం.

ఒక విధంగా విశాల్ చంద్రశేఖర్ కి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో విశాల్ చంద్రశేఖర్ కు సరైన అవకాశాలు రాలేదు. మరి ఈ అవకాశాన్ని అతను ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారని చాలా రోజులుగా టాక్ వినిపిస్తూనే ఉంది. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.


Tags:    

Similar News