'ఆత్రేయ' మార్క్.. పాత బాకీ కూడా క్లియర్!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. రీసెంట్ గా సరిపోదా శనివారం మూవీతో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-08-30 11:27 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. రీసెంట్ గా సరిపోదా శనివారం మూవీతో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఆయన.. ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేశారు. అటు అభిమానులు.. ఇటు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తన యాక్షన్ తో అందరినీ ఫిదా చేశారు. మూవీలో సూర్య పాత్రలో ఒదిగిపోయి తనలోని టాలెంట్ ను మొత్తం బయటపెట్టేశారు.

కోలీవుడ్ నటుడు ఎస్ జే సూర్య.. ఇన్స్పెక్టర్ దయానంద రోల్ లో అదరగొట్టేశారనే చెప్పాలి. తన చూపులతోనే భయపెడుతూ విలనిజాన్ని ప్రదర్శించారు. దయానంద రోల్ కు పెర్ఫెక్ట్ సెలెక్షన్ తానేనని అనిపించుకున్నారు. ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ తన మార్క్ యాక్షన్ ఎలా ఉంటుందో సరిపోదా శనివారం చిత్రంతో చూపించారు. తాను క్లాసే కాదు మాస్ సబ్జెక్టులను కూడా సరైన రీతిలో డీల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు. ఆయన స్టోరీని మలిచిన తీరు వేరే లెవెల్ లో అనిపించింది.

అయితే నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ రాగానే అంతా షాకైపోయారు. ఇది వరకే ఆయనతో అంటే సుందరానికి మూవీ చేసిన నాని అనుకున్నంత స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు. దీంతో మళ్లీ ఎందుకు నేచురల్ స్టార్ ఆయనకు ఛాన్స్ ఇచ్చారని అంతా మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కూడా జోరుగా చర్చ సాగింది. కానీ సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యాక.. అప్పుడు అనుకున్నవి నిజం కావని ఇప్పుడు అంతా ఓ క్లారిటీకి వచ్చేశారు.

నాని నమ్మకాన్ని వివేక్ ఆత్రేయ నిలబెట్టుకున్నారని నెటిజన్లతోపాటు ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. అంటే సుందరానికి మూవీతో కాస్త నిరాశపరిచినా.. ఇప్పుడు అదరగొట్టేశారని చెబుతున్నారు. అప్పటి గాయం ఇప్పుడు పూర్తిగా పోగొట్టేసిందని అంటున్నారు. పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, ట్విస్టులతో వివేక్ ఆత్రేయ ఆకట్టుకున్నారని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. అయితే మూవీ లెన్త్ కాస్త ఎక్కువైందని కొందరు సినీ ప్రియులు అంటున్నా.. సినిమా మాత్రం అన్ని సెంటర్లలో దూసుకుపోతోంది.

అయితే అంటే సుందరానికి మూవీ విషయంలో మేకర్స్ చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేదని ఇప్పటికీ అనేక మంది చెబుతుంటారు. లెన్త్ ఎక్కువ అవ్వడంతో మిక్స్ డ్ టాక్ వచ్చిందని.. లేకుంటే బొమ్మ అదిరిపోయేదని అంటుంటారు. ఏదేమైనా అప్పుడు అలా జరిగినా.. ఇప్పుడు మాత్రం తన మార్క్ ఏంటో చూపించారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. నానికి హ్యాట్రిక్ హిట్ ఇచ్చారు. తాను కూడా మంచి హిట్ అందుకుని ఫుల్ సక్సెస్ మోడ్ లో ఉన్నారు!

Tags:    

Similar News