వినాయక్ పొలిటికల్ ఎంట్రీ పై సోదరుడి కామెంట్ ఇది!
అంటే ఆయన సోదరుడు లైన్ లోకి రాక తప్పలేదు. ఈ విషయంపై వినాయక్ సోదరుడుని సంప్రదించగా ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని..అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
వి.వినాయక్ చాలా కాలంగా సినిమాలు డైరెక్ట్ చేయకపోవడం..అటుపై ఆయన నటుడిగానూ మ్యాకప్ వేసు కోవడం..అక్కడా కొనసాగకపోవడంతో? అసలు ఆయన ఏం చేస్తున్నారు అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ తెరంగేట్రానికి సిద్దమవుతున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. వైకాపాలో చేరుతున్నారని..ఎంపీగా బరిలోకి దిగుతారని ఇలా ఓ వార్త వైరల్ అయింది.
అసలే ఏపీలో ఎన్నికల కాక మొదలైన నేపథ్యంలో ఈ వార్తకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సరిగ్గా ఇదే సమయంలో కాకినాడ లో జరిగిన ఓ పెళ్లికి వినాయక్ సహా సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్లడంతో మరింత ఆసక్తి సంతరించుకుంది. మరి ఇందులో నిజమెంత? వినాయక్ పొలిటికల్ గా బరిలోకి దిగుతున్నారా? అంటే ఆయన సోదరుడు లైన్ లోకి రాక తప్పలేదు. ఈ విషయంపై వినాయక్ సోదరుడుని సంప్రదించగా ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని..అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు అని కూడా ఒక వార్త ప్రచారం లోకి వచ్చింది .
తమని ఏ పార్టీ వారు సంప్రదించలేదన్నారు. అలాగే తమ సోదరుడు ఒకరు వైకాపాలో ఉన్నారని..కానీ మిగిలిన ఎవరికీ రాజకీయాలతో సంబంధం లేదని ఖండిచారు. ఇటీవలే తాము కాకినాడ పెళ్లికి వెళ్లామ ని..అక్కడికి సీఎం జగన్ కూడా వచ్చారని...కానీ అక్కడ ఎవరి పనులు వాళ్లు చూసుకుని వెళ్లిపోయాం తప్ప ఏ నాయకుల్ని కలిసింది లేదన్నారు. ఇలాంటి వార్తలు రావడానికి ఇది కూడా ఓ కారణమైఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి వినాయక్ పొలిటికల్ ఎంట్రీ అయితే అవాస్తవమని సోదరుడి ఖండనతో క్లారిటీ వచ్చేసింది. ప్రస్తు తం వినాయక్ ఓ సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి కూడా ఆయనకు..రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. వినాయక్ చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్ తో `ఛత్రపతి` సినిమా హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు.