బిగ్ బాస్ 7 : ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు.. యుద్ధం మొదలైంది..!
కొత్తగా వచ్చిన ఐదుగురు ఆల్రెడీ హౌస్ లో ఉన్న ఎనిమిది మంది కలిసి హౌస్ లో ఇప్పుడు 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ గౌతం కృష్ణ సీక్రెట్ రూం లో ఉన్నారు కాబట్టి అతను ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ లోకి వచ్చేస్తున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 7 లో లాస్ట్ సండే ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లడం ఆట రసవత్తరంగా మారింది. ఈ సీజన్ ని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న బిగ్ బాస్ టీం ఉల్టా పుల్టా అంటూ కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 2.O అంటూ ఈ సండే నుంచి మరింత క్రేజీగా మారింది. కొత్తగా వచ్చిన ఐదుగురు ఆల్రెడీ హౌస్ లో ఉన్న ఎనిమిది మంది కలిసి హౌస్ లో ఇప్పుడు 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ గౌతం కృష్ణ సీక్రెట్ రూం లో ఉన్నారు కాబట్టి అతను ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ లోకి వచ్చేస్తున్నాడు.
సో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ఆరో వారం నుంచి బిగ్ బాస్ సీజన్ కొనసాగుతుంది. ఇక వీరిలో కొత్త హౌస్ మెట్స్ ని పోటుగాళ్లుగా.. పాత కంటెస్టెంట్స్ ని ఆటగాళ్లుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మండే నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. ఆల్రెడీ ఐదు వారాల ఆట చూసిన కొత్త కంటెస్టెంట్స్ వారి ఆలోచనలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లాలో ఎంపిక చేసుకున్నారు. అయితే మండే రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈరోజు కూడా అది కొనసగుతుంది.
పోటుగాళ్ల నుంచి నయని పావని, అశ్విని ఇప్పటివరకు నామినేట్ అయ్యారు. ఆటగాళ్ల నుంచి అమర్, యావర్, సందీప్, శోభా శెట్టి, తేజ నామినేట్ అయ్యారు. వీరిలో ఈవారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు అన్నది తెలియాల్సి ఉంది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ ఆటని చూసి వచ్చారు కాబట్టి వారికి అది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.
14 మంది హౌస్ మెట్స్ ఉన్న బిగ్ బాస్ సీజన్ 7 లో రాబోయే రోజుల్లో ఆట మరింత క్రేజీగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ సీజన్ ని ఎలాగైనా హిట్ చేయాలనే ఆలోచనతో బిగ్ బాస్ టీం సరికొత్త టాస్క్ లతో హౌస్ మెట్స్ తో ఒక ఆట ఆడుకుంటుంది. సీజన్ 6 తో పోల్చితే సీజన్ 7 అన్ని విధాలుగా మంచి కంటెంట్, టాస్క్ లతో ఆడియన్స్ ని అలరిస్తుందని చెప్పొచ్చు. సీజన్ 7 హోస్టింగ్ విషయంలో కూడా నాగార్జున అదరగొట్టేస్తున్నారు.