వీకెండ్.. సలార్, డంకీ వసూళ్ల పరిస్థితేంటి?
నార్త్ ఇండియాలో ఏకంగా పీవీఆర్, మీరజ్ ఐనాక్స్ వాళ్లు సలార్ కన్నా డంకీకి ఎక్కువే స్క్రీన్లు కేటాయించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డంకీ చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీ పడతాయని అంతా భావించారు. నార్త్ ఇండియాలో ఏకంగా పీవీఆర్, మీరజ్ ఐనాక్స్ వాళ్లు సలార్ కన్నా డంకీకి ఎక్కువే స్క్రీన్లు కేటాయించారు. కానీ రెండు సినిమాలు విడుదలయ్యాక సీన్ అంతా మారిపోయింది. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. డంకీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది.
అయితే తొలి వీకెండ్ లో ఈ రెండు సినిమాలు భారీగానే వసూళ్లు రాబట్టాయి. సలార్ రూ.400 కోట్లకుపైగా వసూళ్లు సాధించగా.. డంకీ రూ.150 కోట్లు వసూలు చేసింది. ఇది బాగానే ఉన్నా.. ఇప్పుడు సెకెండ్ వీకెండ్ కల్లా ఈ రెండు సినిమాలు వసూళ్ల పరంగా డీలా పడ్డాయి. నార్త్ ఇండియాలో అంచనాలు వేసిందానికన్నా తక్కువ వసూళ్లు రాబడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సలార్ మూవీ.. ఫస్ట్ వీకెండ్ లో భారీ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వీక్ డేస్ లో కలెక్షన్లు బాగా తగ్గముఖం పట్టాయి. సెకెండ్ వీకెండ్ లో వసూళ్లు పుంజుకుంటాయాని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ అది కూడా జరగలేదు. శనివారం.. తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా రూ.2.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.
అయితే ఈ మూవీ తమిళ, మలయాళం, కన్నడ వెర్షన్లపై మేకర్స్ కు పెద్దగా అంచనాలు లేవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు వెర్షన్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారని.. ఇప్పుడు వారంతంలో కూడా వసూళ్లు పుంజుకోలేదని అంటున్నారు.
మరోవైపు, షారుక్ డంకీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఫస్ట్ వీకెండ్ పర్వాలేదనంపించినా వీక్ డేస్ లో వసూళ్లు చాలా తక్కువ వచ్చాయి. సెకెండ్ వీకెండ్ లో కలెక్షన్లు రాబడుతోందని భావించినా అది కూడా జరగలేదు. నిన్న ఇండియాలో కేవలం రూ.8.5 కోట్ల మాత్రమే వసూలు చేసింది.
అయితే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లు అవ్వాలంటే ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈరోజు ఆదివారం, రేపు సెలవు రోజు కనుక కలెక్షన్లను సాధించే రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన కల్యాణ్ రామ్ డెవిల్, రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాలు మిక్స్ డ్ టాక్ అందుకున్నాయి. కాబట్టి సలార్, డంకీ వైపే ఆడియన్స్ మొగ్గు చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు.