దేవర.. అక్కడ ఎంత బిజినెస్ చేసిందంటే..

ఇది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న దేవర మూవీ బిజినెస్ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది.

Update: 2024-06-03 16:30 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కర్ణాటకలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ తల్లిగారిది కర్ణాటక ప్రాంతం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ని కూడా అక్కడి ప్రజలు మావాడు అని అనుకుంటారు. అందుకే ఆయనపై కన్నడనాట ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ప్రశాంత్ నీల్ తో తారక్ జతకట్టాక అతని మాస్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న దేవర మూవీ బిజినెస్ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా దేవర సిద్ధం అవుతోంది. ఈ సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవల్ లో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని తారక్ భావిస్తున్నాడు. అక్టోబర్ 10న రిలీజ్ కాబోయే ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ డీల్స్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ బ్రాండ్ ఇమేజ్, మార్కెట్ విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్లుగానే దేవర మూవీపైన బిజినెస్ జరిగింది.

కర్ణాటకలో దేవర మూవీపైన 16 కోట్ల బిజినెస్ డీల్ జరిగిందంట. ఇది ఎన్టీఆర్ కెరియర్ లోనే కన్నడనాట హైయెస్ట్ డీల్ అనే మాట వినిపిస్తోంది. అడ్వాన్స్ బేసిస్ లో ఈ డీల్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. కన్నడ, తెలుగు వెర్షన్స్ రెండు కూడా కర్ణాటకలో రిలీజ్ కానున్నాయంట. రాయలసీమ, తెలంగాణ బోర్డర్ కర్ణాటక జిల్లాలలో తెలుగు వెర్షన్ లో దేవర మూవీ రిలీజ్ కావొచ్చు. మిగిలిన చోట్ల కన్నడ వెర్షన్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందంట.

ఇక ఈ సినిమాకి కన్నడంలో డబ్బింగ్ కూడా తారక్ చెప్పనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే దేవర సినిమాని మరింతగా అక్కడి ఆడియన్స్ ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దేవర మూవీ కర్ణాటకలో సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తే తరువాత తారక్ నుంచి రాబోయే వార్ 2, ప్రశాంత్ నీల్ చిత్రాలు కూడా భారీ బిజినెస్ చేసే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తో దేవర సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఫియర్ సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందంట. దేవర మూవీ ద్వారా జాన్వీ కపూర్ తారక్ కి జోడీగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.

Tags:    

Similar News