పోటుగాడి ప్రియురాలు ఎక్కడ?

తెలుగు లో 2019 వరకు వరుస సినిమాలు చేసిన ఈమెకు ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గాయి.

Update: 2024-09-25 16:30 GMT

మంచు మనోజ్‌ హీరోగా నటించిన 'పోటుగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సాక్షి చౌదరి. ఈ అమ్మడు టాలీవుడ్‌ లో చేసిన సినిమాలు చాలానే ఉన్నా పెద్ద హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. అల్లరి నరేష్ తో ఈ అమ్మడు చేసిన జేమ్స్ బాండ్‌ సినిమా ఒక మోస్తరుగా అలరించింది. ఆ తర్వాత అదే అల్లరి నరేష్ తో సెల్ఫీ రాజా సినిమాలోనూ ఈ అమ్మడు నటించింది. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. తెలుగు లో 2019 వరకు వరుస సినిమాలు చేసిన ఈమెకు ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గాయి. ముఖ్యంగా మెయిన్ లీడ్ హీరోయిన్‌ ఛాన్స్ లు రావడం లేదు.


మొదటి సినిమా 2013 లో చేసిన ఈమె నాలుగు అయిదు సంవత్సరాలు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేసి బిజీగా ఉంది. తెలుగు సినిమాలతో పాటు తమిళ్‌, కన్నడ భాషల్లోనూ ఈ అమ్మడు సినిమాలు చేసి మెప్పించింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడు సొంతం. అంతే కాకుండా అవసరం ఉన్నంత వరకు ఈమె స్కిన్‌ షో చేసేందుకు సిద్ధంగా ఉండేది. అలాగే హీరోలతో రొమాంటిక్‌ సన్నివేశాలకు సైతం ఒక మోస్తరు వరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేది. అయినా కూడా ఈమెకు మంచి క్రేజ్ దక్కలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు కాకుండానే కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొంది.

ఆఫర్లు రాకున్నా ఈ అమ్మడి జోరు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఈ పోటుగాడి ప్రియురాలు వార్తల్లో నిలుస్తూనే ఉంది. గతంతో పోల్చితే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా స్కిన్‌ షో చేస్తుంది. ముందు ముందు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడం కోసం ఈమె ఇలా అందమైన ఫోటోలను షేర్ చేస్తుందా అనే కామెంట్స్ నెట్టింట వస్తున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడి గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా మరచి పోయారు. ఇలాంటి సమయంలో అందమైన ఫోటోల వల్ల మళ్లీ చర్చ జరుగుతుందేమో చూడాలి.

ప్రస్తుతం తెలుగు లో ఒక సినిమాను చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆ సినిమా ఏంటి, ఎప్పటికి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ముందు ముందు అయినా ఆమె మరిన్ని సినిమాల్లో నటించి, ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది చూడాలి. సాక్షి చౌదరి కేవలం సినిమాల్లో నటించాలి అనే పట్టుదలతో కాకుండా వెబ్‌ సిరీస్‌ ల్లో నటించినా మంచి ఫలితాలు దక్కుతాయి. కనుక ఆమె ఆ దిశగా అడుగు లు వేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో ప్రత్యేక పాటల్లో నటించిన సాక్షి చౌదరి వెబ్‌ సిరీస్ లో కాస్త బోల్డ్‌ గా నటిస్తే మంచి పాపులారిటీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News