శంక‌ర్ నెక్స్ట్ హీరో ఎవ‌ర‌బ్బా?

ఆసినిమా షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

Update: 2024-10-25 02:45 GMT

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ త‌దుప‌రి చేయ‌బోయే సినిమా ఏది? ఏ స్టార్ హీరోని డైరెక్ట్ చేయ‌నున్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ తో 'ఇండియ‌న్ -3' పూర్తి చేసారు. ఆసినిమా షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో తెర‌కెక్కిస్తోన్న 'గేమ్ ఛేంజ‌ర్' కూడా ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. షూటింగ్ 90 శాతానికి పైగా పూర్త‌యింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ సహా అన్ని ప‌నులు పూర్తి చేసి జ‌న‌వ‌రి 10న రిలీజ్ చేస్తున్నారు. మ‌రి శంక‌ర్ జీ వాట్ నెక్స్ట్ అంటే? క్లారిటీ రావ‌డం లేదు. ఆయ‌న అంద‌రి డైరెక్ట‌ర్ల‌లో ఏడాదికి ఒక సినిమా చొప్పున చేయ‌రు. రెండు మూడేళ్ల‌కు ఓ సినిమా చేస్తుంటారు. 2.0 తర్వాత ఇండియ‌న్ -2 రిలీజ్ చేయ‌డానికి ఆరేళ్లు ప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో గేమ్ ఛేంజ‌ర్ ప్ర‌క‌టించి ప‌ట్టాలెక్కించారు. ఇక్క‌డో కార‌ణం ఉంది. 'ఇండియ‌న్ -2' చ‌ట్ట ప‌ర‌మైన చిక్కుల్లో ప‌డ‌టంతోనే శంక‌ర్ హుటా హుటిన రామ్ చ‌ర‌ణ్ లైన్ లో పెట్టి దీన్ని ప‌ట్టాలెక్కించారు.

లేదంటే ఈ సినిమా ఉండేది కాదు. మ‌రి ఆ లెక్క‌లో చూసుకుంటే శంక‌ర్ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించాలంటే మ‌రో రెండేళ్లు అయినా స‌మ‌యం ప‌ట్టొచ్చ‌నే గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి. అయితే ఈసారి శంక‌ర్ హిట్ కొట్ట‌డం కూడా కీల‌క‌మైన అంశ‌మే. కొంత కాలంగా ఆయ‌న‌కు స‌రైన హిట్లు ప‌డ‌లేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన 'ఇండియ‌న్ -2' ఫెయిలైంది. అయినా ఇండియ‌న్ 3 తో ఏదో మ్యాజిక్ చేస్తున్నాం అనే కాన్పిడెంట్ తో వ‌స్తున్నారు.

అంటే గేమ్ ఛేంజ‌ర్ విజ‌యం అన్న‌ది శంకర్ కి కీల‌కం. త‌దుప‌రి ఆయ‌న స్టార్ హీరోతో సినిమా వేగంగా ప్ర‌క‌టించాలి అంటే? ఈ సినిమా విజ‌యం కీల‌క పాత్ర పోషిస్తుంది. మ‌రి శంక‌ర్ త‌దుప‌రి డైరెక్ట్ చేసే హీరో ఎవ‌రు అవుతారో చూడాలి. ప్ర‌స్తుతానికి శంక‌ర్ దృష్టంతో లైన‌ప్ లో ఉన్న చిత్రాల‌పైనే ఉంది.

Tags:    

Similar News