సూపర్ స్టార్‌ ఆ తేదీకి వస్తున్నాడా? లేదా?

ఆ తేదీకి ఇంకా నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది.

Update: 2024-09-07 07:47 GMT

తమిళ్‌ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన జైలర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రజినీకాంత్‌ తదుపరి సినిమా వేట్టయాన్ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. అక్టోబర్ 10న వేట్టయాన్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ తేదీకి ఇంకా నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రమోషన్ హడావుడి మొదలు అవ్వలేదు. కనీసం ఆ తేదీకే విడుదల చేస్తామని ప్రకటించలేదు.

టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని టెక్నికల్‌ ఇష్యూస్ కారణంగా సినిమా విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేట్టయాన్ సినిమా కోసం తమిళ్‌ ఫ్యాన్స్ తో పాటు అన్ని భాషల సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క పాట కూడా విడుదల చేయలేదు. పైగా నిర్మాణ సంస్థ నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దాంతో సినిమా విడుదల విషయమై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జైలర్ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రజినీకాంత్ నుంచి సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉంటుంది అనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే చిత్ర యూనిట్‌ సభ్యులు ఏ విషయంలో లైట్‌ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జై భీమ్ వంటి సూపర్ హిట్ మూవీని రూపొందించిన జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విడుదల తేదీ విషయంలో మేకర్స్ త్వరగా క్లారిటీ ఇవ్వాలంటూ రజినీకాంత్‌ ఫ్యాన్స్ డిమాండ్‌ చేస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో రజినీకాంత్‌ తో పాటు అమితాబచ్చన్‌, ఫహద్‌ ఫాసిల్‌, రానా దగ్గుబాటి, రితికా సింగ్‌, మంజు వారియర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు మాత్రం అసలు సౌండ్ లేకుండా సైలెంట్‌ గా ఉండటంతో ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్‌ జుట్టు పీక్కుంటున్నారు. నెట్టింట జరుగుతున్న ప్రచారం ప్రకారం వేట్టయాన్ సినిమా ఆ తేదీకి వచ్చేది అనుమానమే అనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News