రాజుగారు రెడీగా ఉన్నారు..మీలో ఆ ట్యాలెంట్ ఉందా?

ఇక ఆయ‌న స్థాపించిన నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది ప్ర‌తిభావంతులు వెలుగులోకి వ‌చ్చారు.

Update: 2024-05-24 02:30 GMT

స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డిస్ట్రిబ్యూట‌ర్ నుంచి నిర్మాత‌గా ఎదిగిన వారు. ఇండ‌స్ట్రీలో ఎలాంటి స‌హ‌కారం లేకుండా స్వ‌యంగా ఎదిగిన నిర్మాత‌. సురేష్ బాబు..అల్లు అర‌వింద్ లాంటి లెజెండ‌రీ నిర్మాత‌ల స‌ర‌స‌న స్థానం సంపాదించారంటే? ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టే సాధ్య‌మైంది. ఇక ఆయ‌న స్థాపించిన నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది ప్ర‌తిభావంతులు వెలుగులోకి వ‌చ్చారు.

ముఖ్యంగా కొత్త ద‌ర్శ‌కుల‌కు ఛాన్స్ లివ్వ‌డం రాజుగారి ప్ర‌త్యేక‌త‌. సుకుమార్, బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు బాస్కర్, శ్రీరామ్ వేణు, వంశీ పైడిపల్లి లాంటి వారిని ఎంతో మంది డైరెక్ట‌ర్ అయింది ఆయ‌న వ‌ల్లే. త‌న సంస్థ‌లో అవ‌కాశాలు క‌ల్పించ‌డంతో నేడు స్టార్ డైరెక్ట‌ర్ల‌గా ఎదిగారు. ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకుంటున్నారు. ఇటీవ‌లే `బ‌ల‌గం` సినిమాతో వేణు కూడా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అత‌డిలో అంత గొప్ప ట్యాలెంట్ ఉంద‌ని దిల్ రాజు వ‌ల్లే సాధ్య‌మైంది.

అప్ప‌టి వ‌ర‌కూ వేణు చిన్న చిన్న పాత్ర‌లు పోషించే క‌మెడియ‌న్. కానీ 'బ‌లగం' త‌ర్వాత తానేంటో ఇండ‌స్ట్రీ స‌హా ప్రేక్ష‌కుల‌కు తెలిసింది. వేణులో ఇంత ట్యాలెంట్ ఉందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. మెగాస్టార్ చిరంజీవి సైతం వేణుని ఇంటికి పిలిపించి స‌న్మానించారు. ఇదంతా రాజుగారు వ‌ల్లే సాధ్య‌మైంది. ఇంకా రాజుగారు ఎంతో మంది కొత్త న‌టుల్ని సైతం తెరపైకి తెచ్చిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. ఇంకా చెప్పాలంటే? రాజుగారిని మూవీ మెఘ‌ల్ రామానాయుడితో ఈ విష‌యంలో పోలిక చేయోచ్చు.

అప్ప‌ట్లో రామానాయుడు సంస్థ ద్వారా ఎంతో మంది ద‌ర్శ‌కులుగా..న‌టీన‌టులుగా ప‌రిచ‌మ‌య్యారు. ఇప్ప‌టికీ ఆ విధానం ఆ సంస్థ‌లో కొన‌సాగుతుంది. తాజాగా జ‌రిగిన ఓ వేడుక‌లో రాజుగారు మ‌రోసారి కొత్త‌వాళ్ల‌కి త‌న సంస్థ‌లో ఎప్పుడూ అవ‌కాశాలుంటాయ‌నే ధీమా క‌ల్పించారు. ప్రతి సంవత్సరం దిల్ రాజు ప్రొడక్షన్స్ ద్వారా కొత్త దర్శకులను లాంచ్ చేస్తూనే ఉంటానని వేదికపై దిల్ రాజు మ‌రోసారి ప్రకటించారు. ఇప్ప‌టికే కొంత మంది కొత్త వారు క్యూలో ఉన్నార‌ని..వాళ్ల ఎంట్రీ ఖ‌రారైతే మ‌రింత మందికి త‌న సంస్థ‌లో అవ‌కాశాలుంటాయ‌న్నారు. నిజంగా ట్యాలెంట్ ఉన్న వారికి ఆ సంస్థ మంచి అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌ని చెప్పొచ్చు.

Tags:    

Similar News