భర్త నిర్మాణంలో భార్య తొలి ప్రయత్నం!
దీంతో ఈ సినిమాలో ముగ్గురు భాగస్వాము లున్నా అందులో ఒక నిర్మాత యామీగౌతమ్ భర్త కావడంతో! ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి సంతరించుకుంది.
యామీ గౌతమ్-ఆదిత్య ధర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అమ్మడు బాలీవుడ్ బిజీగా ఉంటుంది. భర్త నిర్మాణంలోనూ బిజీగా ఉంటారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చిందా? అంటే ఇప్పటివరకూ జరగలేదు. భార్యని ప్రోత్సహిస్తూ ఆదిత్య లేడీ ఓరియేంటెడ్ సినిమా లాంటిదేది ప్లాన్ చేయలేదు. పేరున్న నటి అయితే ఇంట్లో ఉన్న నిర్మాత భార్యతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
కానీ ఆదిత్య అలాంటి సాహసం ఇంతవరకూ చేయలేదు. అయితే భర్త నిర్మాణంలో యామీ అనుకోండా ఓ సినిమా చేసినట్లు తెలుస్తోంది. యామీ గౌతమి-ప్రతీక్ గాంధీ జంటగా 'ధూం ధాం' అనే వినోదాత్మక సినిమా తెరకెక్కుతోంది. రిషబ్ సేత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య ధర్-లోకేష్ ధర్-జ్యోతి దేశ్ పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓటీటీ వేదికగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా నిర్మాణంలో యామీ గౌతమ్ హీరోయిన్ గా ఎంపికైన సమయానికి ఆదిత్య ధర్ నిర్మాతగా లేరన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేరే నిర్మాతలతో ఈ సినిమా ప్లాన్ చేసారుట. చివరికి అటు తిరిగి..ఇటు తిరిగి ఈ త్రయం హ్యాండ్స్ లోకి వచ్చింది. దీంతో ఈ సినిమాలో ముగ్గురు భాగస్వాము లున్నా అందులో ఒక నిర్మాత యామీగౌతమ్ భర్త కావడంతో! ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి సంతరించుకుంది.
అలా తొలిసారి భర్త నిర్మాణంలో యామీ గౌతమీ నటిస్తోన్న తొలి సినిమా గా బాలీవుడ్ మీడియాలో ఫోకస్ అవుతుంది. ఇద్దరి కాంబినేషన్ లో మొదటి ప్రయత్నం విజయం సాధించాలని సోషల్ మీడియా వేదికగా యామీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా కేవలం నిర్మాణం వరకే పరిమితం.
ఆదిత్య నిర్మాత మాత్రమే కాదు. మంచి దర్శకుడు కూడా. బాలీవుడ్ లో 'ఉరీ' సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సినిమా తీసింది ఆయనే. అందులో యామీగౌతమి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో దర్శకుడిగా ఆయనకు మంచి పేరొచ్చింది. తాజా సినిమాతో యామీ గౌతమీ హబ్బీతో నిర్మాణ అనుభవాన్ని చూసింది.