సెక్రటరీతో రేఖ రిలేషన్..ఖండించన రైటర్!
బాలీవుడ్ అందాల తార రేఖ బయోగ్రపీ `రేఖ: దిఅన్ టోల్డ్ స్టోరీ` ఆధారంగా ఓ వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ అందాల తార రేఖ బయోగ్రపీ `రేఖ: దిఅన్ టోల్డ్ స్టోరీ` ఆధారంగా ఓ వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రేఖకు సెక్రటరీ పర్జానాతో రిలేషన్ ఉందని..నటి వ్యక్తిగత..వృత్తిపరమైన జీవితాన్ని ఆమె ఎక్కువగా కంట్రోల్ చేసేదాన్ని నెట్టింట కథనాలు సంచలనం రేపాయి. రేఖ భర్త చనిపోవడానికి కూడా సెక్రటరీ ఓ కారణమని బాలీవుడ్ మీడియా కథనాలు అంతకంతకు వెడెక్కిస్తున్నాయి.
కొన్ని రోజులగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రేఖ జీవితాన్ని రాసిన రచయిత యాసర్ ఉస్మాన్ ఈ కథనాలపై స్పందించారు. తన బుక్ ఆధారంగా వస్తోన్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. సెన్షేషన్ కావడం కోసం కొన్ని వెబ్ సైట్స్ కావాలనే ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నా యన్నారు. `రేఖ ది అన్ టోల్డ్ స్టోరీ`కి కొంత మంది కావాలని లివ్ ఇన్ రిలేషన్ అనే పదాలు ఆపాదించారని..అలాంటి పదాలు బుక్ లో ఎక్కడా వాడలేదన్నారు.
తన రచనని ఆధారంగా చేసుకుని అసత్యాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని తొలగించక పోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే ఈ వివాదంపై రేఖ ఇంతవరకూ స్పందించలేదు. బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రేఖ వ్యాపార వేత్త ముఖేష్ అగర్వాల్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన ఏడు నెలలకే ముకేష్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన ఆత్మహత్యకు రేఖ వ్యవహర శైలి కారణమని అప్పట్లో మీడియాలో సైతం ప్రచారం సాగింది. తాజాగా రచయిత ఖండనతో వాటికి పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. రేఖ బాలీవుడ్ లో వినోద్ ఖన్నా..రాజేంద్ర కుమార్..జితేంద్ర.. దర్మేంద్ర.. రణధీర్ కపూర్.. అమితాచ్చన్ లతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. రేఖకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. అందాల నటిగా ఆమె ఎంతో పాపులర్.