ఆ ఇద్దరికీ తోడుగా మరో యంగ్ హీరో!
తాజాగా ఆ యంగ్ హీరోలకి ఇద్దరికీ తోడుగా ఇండస్ట్రీలో మరో యంగ్ హీరో కూడా తయరాయ్యాడు.
సక్సెస్ లతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే కొంత మంది యంగ్ హీరోలు టాలీవుడ్ లో కొందరున్న సంగతి తెలిసిందే. అందులో ప్రముఖంగా ఓ ఇద్దరు పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇండస్ట్రీలో బ్యాకప్ ఉండటంతో అవకాశాలు వస్తున్నాయి. అలా నటించుకుంటూ వెళ్లిపోతున్నారు. మరి అవి ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నాయంటే? అవి ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతున్నాయి.
ఎప్పుడు పూర్తవుతున్నాయో! ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో కూడా అర్దం కాని సన్నివేశం కనిపిస్తుంది. ఏడాది చివర్లో వాళ్లు చేసిన సినిమా జాబితా చూస్తూ మాత్రం ఖంగుతినాల్సిందే. ఎందుకంటే ఏ హీరో చేయనని సినిమాలు ఆ ఇద్దరు జాబితాలో కనిపిస్తున్నాయి. కనీసం లో కనీసం నాలుగు నుంచి ఆరు సినిమాలైనా ఉంటున్నాయి. అంతకు మంచే ఉంటాయి గానీ..తగ్గడానికి మాత్రం ఛాన్స్ లేదు.
మరి వాళ్లతో సినిమాలు చేసిన నిర్మాతలు ఎంతవకు లాభ పడ్డారో ఆ పెరుమాళ్లకే ఎరుక. తాజాగా ఆ యంగ్ హీరోలకి ఇద్దరికీ తోడుగా ఇండస్ట్రీలో మరో యంగ్ హీరో కూడా తయరాయ్యాడు. ఈ మధ్య ఈ కుర్ర హీరో కూడా ఎక్కువగా నే సినిమాలు చేస్తున్నాడు. ఇలా ప్రారంభిస్తున్నాడు. అలా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఆ రెండు ముగించుకుని మీడియా ముందుకొచ్చేస్తున్నాడు. సినిమా గురించి తమదైన శైలిలో నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు.
ఆ తర్వాత మాత్రం పత్తా ఉండటం లేదు. రెండేళ్లగా ఆహీరో జర్నీ ఇలాగే సాగుతుంది. ఆయన సాధించిన విజయాలు ఎక్కడైనా కనిపిస్తాయా! రిలీజ్ అయిన వాటిలో కనీసం యావరేజ్ చిత్రాలు కూడా లేవు. కానీ అవకాశాలకు మాత్రం కొదవలేదు. వాటి ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త అవకాశాలు ఒడిసిపట్టు కుంటున్నాడు. వాటిలో కొన్ని తానే స్వయంగా సృష్టించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా లీకైంది.
నా మార్కెట్ ఇంత అని చెప్పి కొత్త నిర్మాతల్ని లాక్ చేస్తున్నారుట. అలాగని నిర్మాతల్ని మోసం చేయడం కాదు. వాళ్లకి రూపాయి లాభం చూపించే ఈ పనిచేస్తున్నాడుట. మరి నష్టపోతుంది ఎవరు? అంటే మధ్యలో ఉన్న వాళ్లకే ఆ నొప్పి తెలుస్తుందని అంటున్నారు.