యంగ్ టైగర్ కూడా సూపర్ స్టార్ బ్రెయిన్ తో!
మీరు ప్లాప్ ల్లో ఉన్నారు...అతినితో సినిమా అవసరమా? అని వెనుక నుంచి చాలా మంది సలహాలి చ్చారు. కానీ రజనీకాంత్ మాత్రం నెల్సన్ కిచ్చిన మాట ప్రకారం సినిమా చేసారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ లా విశ్లేషిస్తారా? రజనీ లానే మాట ఇచ్చాడంటే! తనకన్నా తన మాటకే విలువెక్కు అనిపిస్తాడా? తాను నమ్మిన సిద్దాంతానికే టైగర్ ఎప్పుడూ కట్టుబడి ఉంటాడా? అంటే అవుననే తెలుస్తోంది. 'జైలర్' సినిమాతో రజనీకాంత్ ఇటీవల ఎలాంటి సక్సెస్ అందుకు న్నారో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. రజనీకాంత్ కి చాలా కాలం తర్వాత వచ్చిన బ్రేక్ ఇది. ఈ సక్సెస్ కారకుడు రజనీకాంత్ మాత్రమే.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ని నమ్మి ముందుకెళ్లారు కాబట్టే అది సాధ్యమైంది. ఇలా రజనీ...నెల్సన్ ని నమ్మడంతో మాట మీద నిలబడే వ్యక్తి అని మరోసారి రుజువైంది. నెల్సన్ అంతకు ముందు తెరెక్కించిన 'బీస్ట్' అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నెల్సన్ తో సినిమా వద్దు అని రజనికి చాలా మంది సలహాలు ఇచ్చారు. అతను ప్లాప్ ల్లో ఉన్నాడు..ఇప్పుడు మీరు సినిమా చేస్తే అది ప్లాప్ అవుతుంది.
మీరు ప్లాప్ ల్లో ఉన్నారు...అతినితో సినిమా అవసరమా? అని వెనుక నుంచి చాలా మంది సలహాలి చ్చారు. కానీ రజనీకాంత్ మాత్రం నెల్సన్ కిచ్చిన మాట ప్రకారం సినిమా చేసారు. ఆ మాట కోసం సినిమా చేసారా? కథలో నిజంగా దమ్ముందని సినిమా చేసారా? రెండు ఉన్నాయి కాబట్టే సాధ్యమైంది. కానీ రజనీకాంత్ ఇచ్చిన మాటకి కట్టుబడే వ్యక్తి. మాట ఇచ్చిన తర్వాత మడం తిప్పని వ్యక్తిత్వం అతనిది.
సరిగ్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పరిశీలించినా రజనీ కాంత్ లాగే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పొచ్చు. ఆయన మాటలాగే మనసు వెన్న అన్నది అందరికీ తెలుసు. దర్శకుడి ప్రతిభ తప్ప ఇంకే విషయాలు తారక్ ఆలోచించరు. అందుకే 'అజ్ఞాతవాసి' లాంటి అట్టర్ ప్లాప్ సినిమా ఇచ్చినా టైగర్ ...త్రివిక్రమ్ తో 'అరవింద సమేత వీర రాఘవ' చేసాడు. అప్పటివరకూ త్రివిక్రమ్ తో తారక్ ఎలాంటి సినిమా చేయలేదు.
గతంలో గురూజీ విజయాలు...రైటింగ్ శైలి..ప్రతిభ మెచ్చి మాత్రమే చూసి అవకాశం ఇచ్చారు. అందుకే అజ్ఞాతవాసి ప్లాప్ అయిన రెండు నెలల్లోనే అరవింద సమేత ని సెట్స్ కి తీసుకెళ్లారు. అటుపై 'ఆచార్య'తో మెగాస్టార్ చిరంజీవికి భారీ డిజాస్టర్ అందించిన కొరటాల శివతోనూ 'దేవర'ని షురూ చేసారు. అయితే స్టోరీ విషయంలో కొంత తర్జన భర్జన సాగినా చివరికి కొరటాలకే ఒటేసారు.
ఈ క్రమంలో టైగర్ శివతో సినిమా చేస్తాడా? లేదా? అని మీడియాలో చాలా నెగిటివ్ కథనాలు వైరల్ అయ్యాయి. వాటన్నింటికి 'దేవర' లాంచింగ్ తో పుల్ స్టాప్ పెట్టేసారు. ఇలా ఎన్టీఆర్ దర్శకుల ప్రతిభని నమ్మి...ఇచ్చిన మాటకు కట్టుబడి సినిమాలు చేస్తారు తప్ప! అభూత కల్పనలకు దరిదాపుల్లో కూడా రానివ్వరని చెప్పొచ్చు.